ఆనందయ్య మందు: ల్యాబ్‌ నుంచి పాజిటివ్ రిపోర్ట్‌

నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్‌ కమిషనర్‌ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. ఆనందయ్య.. రాములు ఎదుట ఆయుర్వేద మందు తయారీని చూపించనున్నారు. ఈ సందర్భంగా రాములు మీడియాతో మాట్లాడుతూ, నిన్న(శుక్రవారం) ముత్తుకూరులో కొంతమందితో, ఆనందయ్య వద్ద పనిచేసేవారితో మాట్లాడామని తెలిపారు. ఆనందయ్య మందును ఎలా తయారు చేస్తారో పరిశీలిస్తామని రాములు పేర్కొన్నారు. మందు తయారీలో వాడే పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని.. మందు తయారీ పదార్థాలపై ల్యాబ్‌ నుంచి పాజిటివ్ రిపోర్టే వచ్చిందని రాములు వెల్లడించారు.

ఆనందయ్య మందును తీసుకున్నవారి అభిప్రాయాలనూ సేకరిస్తామన్నారు. ఐసీఎంఆర్ బృందం పరిశీలిన తర్వాత వారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటామని ఆయన తెలిపారు. మందు తయారీ అధ్యయనం తర్వాత నివేదికకు వారం పైనే పడుతుందని రాములు వెల్లడించారు. అప్పటివరకు కృష్ణపట్నం రావొద్దు: జేసీ ఆనందయ్య ఆయుర్వేద మందుపై సీఎంఆర్, ఆయూష్‌ బృందాలు అధ్యయనం చేస్తున్నాయని జేసీ హరేంద్రప్రసాద్ తెలిపారు. నివేదిక వచ్చేందుకు వారం, 10 రోజులు పట్టొచ్చని.. ఫైనల్‌గా ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాతే మందు పంపిణీ చేపడతామని ఆయన వివరించారు. అప్పటి వరకు ప్రజలెవరూ కృష్ణపట్నం రావొద్దని జేసీ స్పష్టం చేశారు.

Nithin Varma

Myself Nithin Varma, I love writing articles on Movies & Technology. Writing articles since 2014

8 thoughts on “ఆనందయ్య మందు: ల్యాబ్‌ నుంచి పాజిటివ్ రిపోర్ట్‌

  1. Pingback: tizanidine buy
  2. Pingback: molnupiravir cost
  3. Pingback: baricitinib 2 mg
  4. Pingback: latisse serum
  5. Pingback: 2sandwich

Leave a Reply