ఇది చూసాక రాత్రి నిద్ర పట్టటం కష్టమే..!!

నమ్మశక్యంగా లేకపోయినా.. ఇది ‘నగ్న’ సత్యం అంటున్నారు ‘నగ్నం’ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వెస్ట్ గోదావరి స్వీటీ పాపతో నగ్నం-నేకెడ్ అనే లషు చిత్రాన్ని రూపొందించి జూన్ 27 రాత్రి 9 గంటలకు RGVWorld.in/ShreyasET ద్వారా సోషల్ మీడియాలో విడుదల చేశారు ఆర్జీవీ. అంతకు పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే మరో బూతు చిత్రాన్ని తీసి ఆన్ లైన్‌లో కాసులు కురిపించుకున్న వర్మ.. ఈ యాపారం ఏదో బాగుందని ఎలాగూ సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది కాబట్టి దేవరపల్లి (వెస్ట్ గోదావరి) పెద పాపతో ‘N@KED (నగ్న#) అనే చిత్రాన్ని వదిలిపెట్టారు. స్వీటీ నగ్న చిత్రం చూడాలంటే.. రూ. 200 చెల్లించాల్సి ఉంటుందని రేటు ఫిక్స్ చేశారు వర్మ.

అసలే లాక్ డౌన్ కరువులో ఉన్నారో ఏమో కాని.. స్వీటీ పాప ‘నగ్నం’ చూసేందుకు పోటీ పడ్డారు నెటిజన్లు. ఏకంగా తొలి అరగంటలోనే 23,560 టిక్కెట్లు అమ్ముడు కాగా.. ఈ లఘు చిత్రం మొదటి 12 గంటలలో 70 లక్షల రెవెన్యూ తీసుకొచ్చింది. ఇక తొలి 20 గంటల్లో ఏకంగా 35445 పెయిడ్ వ్యూస్ వచ్చాయి. సోమవారం నాటికి కోటిని క్రాస్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ‘నగ్నం’. అయితే సినిమా ఎగబడి చూసిన వాళ్లు ఇందులో ఏం లేదని తేల్చేసినా.. వర్మ కాన్సెప్ట్ అది కాదు కదా. సినిమాపై క్లిక్ చేసేలా చేయడమో కావడంతో వర్మ ‘నగ్నం’తో సూపర్బ్ సక్సెస్ అయ్యాడు.

ఒకవైపు బడా నిర్మాతలు పెద్ద పెద్ద సినిమాలు తీసి ఎలా విడుదల చేయాలా అని తలల పట్టుకుంటుంటే.. లక్ష రెండు లక్షలతో సినిమాలు ఆర్జీవీ కొత్త పంథాలో ముందుకు వెళ్తున్నాడు.ఇదిలా ఉంటే.. ఇంతకీ వర్మ ఈ సినిమాను ఎంత బడ్డెట్‌తో తీశాడు అంటే.. కొంత మంది ఐదు లక్షలు అని.. ఇంకొంత మంది లక్ష అంటూ లెక్కలు చెప్పారు. మూవీ క్రిటిక్ మహేష్ కత్తి అయితే ఓ అడుగు ముందుకు వేసి.. ‘‘అంటే మీరు ఒప్పుకోరుగానీ… వర్మ “నగ్నం” రాజమౌళి ‘బాహుబలి’ రికార్డుల్ని బద్దలుకొట్టింది.

లక్ష రూపాయల ఖర్చుతో తీసిన ఈ లఘు చిత్రం మొదటి 12 గంటలలో 70 లక్షల రెవెన్యూ తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్పండ్రా…వాట్ టు డూ వాట్ నాట్ టు డూ!?!’’ అంటూ వర్మ నగ్నం కలెక్షన్లపై పోస్ట్ పెట్టాడు.

Leave a Reply

Your email address will not be published.