ఆడవాళ్ళు అక్రమసంబంధాలు పెట్టుకోవడానికి 6 కారణాలు

కుటుంబాలలో గొడవలకి ఒక ప్రధానకారణం వివాహేతర సంబంధాలు. డబ్బున్న కుటుంబాలలో విడాకులకి, పేద కుటుంబాల్లో హత్యలకి చాలావరకు అక్రమసంబందాలే కారణం అవుతుంటాయి. ఇలాంటి సంబంధాలు, ఆ సంబంధం పెట్టుకున్నవారి పిల్లల జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. సమాజాన్నిఅస్థిరపరుస్తాయి. ఏడడుగుల బంధం తో ఒక్కటైన జంట మధ్య మూడో వ్యక్తి రావడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి.. అవేమిటంటే.భర్త కి కనుక తాగుడు, పేకాట లాంటి వ్యసనాలు ఉంటే,అలాంటి వారి భార్యలు అక్రమసంబంధం పెట్టుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది

తాగుడికి బానిసైన వాడు, ఎప్పుడో ఇంటికోస్తాడు, ఇంటి బాధ్యత పట్టించుకోడు, భార్యతో శృంగారం చేసినా అది యాంత్రికంగా ఉంటుంది తప్ప ఎమోషన్ ఉండదు. ఇలాంటి వారి భార్యలు గత్యంతరం లేని పరిస్థితుల్లో వేరే ఎఫైర్స్ వైపు మొగ్గు చూపుతారు.అక్రమసంబందాలు పెట్టుకోవడానికి ప్రధాన కారణం అవతలివారు అంటే బోర్ కొట్టడం. చాలా సార్లు రిలేషన్ షిప్‌లో ఉన్న వ్యక్తులు ఇద్దరూ రెండవ వారిని పట్టించుకోవడం మానేస్తారు. దీంతో కొత్త వ్యక్తులతో, కొత్త పరిచయాలతో ఆకర్షణలతో వచ్చే థ్రిల్, ఎక్సైట్మెంట్ కోసం ప్రయత్నిస్తారు.

చాలామంది మగవాళ్ళు పెళ్లి కాగానే శరీరం మీద శ్రద్ధ పెట్టడం తగ్గిస్తారు. పిల్లలు పుట్టాక అయితే మరీ. బొజ్జని ఒక కుండ లాగా పెంచేసి, శరీరాన్ని భారీగా పెంచేసి, కదలడమే కష్టం అన్నట్లు తయారవుతారు. ఇలాంటి తన జీవిత భాగస్వామిని ‘సంతృప్తి’ పరచలేక పోవచ్చు. అలాంటప్పుడు కూడా ఆడవారు ఎఫైర్స్ వైపు మళ్లుతారు.చాలా సార్లు శృంగారానికి సంబంధించి ఇద్దరి వేవ్‌లెంత్ ఒకటి కాకపోతే ఆ సమస్యని సరిదిద్దుకుందామనే ఆలోచన తక్కువగా బయట ఆ సరదాలు తీర్చుకుందాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది.

కొంతమంది వృత్తి రీత్యా ఎక్కువ క్యాంపులకి వెళ్ళాల్సివస్తుంది. రోజుల తరబడి భర్త దూరంగా ఉంటే, అలాంటివాళ్ళు ఎఫైర్స్ వైపు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. అయితే క్యాంపులు తప్పనప్పుడు, ఊర్లో ఉన్నప్పుడు అయినా భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి, తన లైంగిక ఆసక్తులని గమనించి కోరికలు తీర్చాలి., క్యాంపు కి వెళ్ళినప్పుడు రోజుకి రెండు మూడు సార్లైనా భార్యకి ఫోన్ చేయాలి.