Cinema

Chiranjeevi : చిరంజీవి పై కోడి గుడ్ల వర్షం.. అసలేం జరిగింది..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా పలు సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. గతేడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ అందుకున్నాడు. చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలై విజయం సాధించింది. తాజాగా ఓ కార్యక్రమంలో చిరంజీవి ఈ విషయం గురించి మాట్లాడారు.

chiranjeevi-attacked-with-eggs

ప్రస్తుతం ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి తన 154వ సినిమా తర్వాత యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన వేరే చిత్రాలకు కంటే ఈ సినిమా కు స్పందన బాగా రావడంతో పాటు మౌత్ టాక్ తో వాల్తేరు వీరయ్య మిగతా సినిమాల కంటే మెరుగ్గా రాణించాడు.

chiranjeevi

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్లలో విడుదలైంది. మిగతా ఏరియాలతో పోలిస్తే నైజాంలో తొలిరోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా ఇప్పటికే అమెరికాలో రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది కాబట్టి చిరంజీవి కెరీర్‌లో అమెరికాలో రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన మూడో సినిమా ఇదే అవుతుంది. రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన చిరంజీవి ఇతర సినిమాలు సైరా మరియు ఖైదీ నంబర్ 150. ఈ చిత్రం అక్కడ ఇప్పటివరకు 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

ఈ చిత్రం థియేట్రికల్ రన్‌ను పూర్తి చేయడమే కాకుండా, ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్ర‌వ‌రి 27 నుంచి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది.మ‌ళ్లీ సినిమా చూడ‌బోతున్నార‌ని అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 10న సోనీ లివ్‌లో ప్రారంభం కానున్న “నిజం విత్ స్మిత” అనే కొత్త టాక్ షో మొదటి ఎపిసోడ్‌లో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ప్రోమోలో చిరంజీవి గతంలో తనకు జరిగిన అవమానాల గురించి మాట్లాడాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Priya Reddy

#Foodie #MovieLover Iam Priya from hyderabad, I love writing content Especially on Movies. Love eating Mirchi bajji While Its Raining