CinemaTrending

Prabhas: ప్రభాస్ భార్య పిల్లల ఫొటోల్లో బిగ్ ట్విస్ట్.. ప్రభాస్ తల్లి కామెంట్స్ వైరల్..

Prabhas Mother Comments: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. ప్రభాస్ వయసు నాలుగు పదులు దాటేసింది. టాలీవుడ్ ఉన్న సీనియర్ హీరోలు ఒక్కొక్కరూ పెళ్లి చేసుకున్నా ప్రభాస్ ఇంకా పెళ్లికి దూరంగా ఉంటున్నాడు. ప్రభాస్ పెళ్లి వార్త కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులతో పాటు ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి అనేక రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలానా అమ్మాయితో డార్లింగ్ ఏడు అడుగులు వేయబోతున్నట్టు టాక్ వినిపించింది.

actor-prabhas-mother-sensational-comments-on-her-marriage-pics-with-anushka-shetty

అప్పట్లో బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అనుకున్నారు. ప్రభాస్ మాత్రం పెళ్లి అనే మాట ఎత్తకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలేవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఆదిపురుష్ హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తో ప్రేమాయణం అంటూ వార్తలు వినిపించాయి. అందులో మాత్రం నిజం లేదని ఆ బ్యూటీ కొట్టిపారేసింది. ఇక ముందు నుంచి ప్రభాస్ అనుష్క పెళ్లి జరిగితే బాగుంటుందని ఆశపడుతుంటారు ప్రభాస్ అభిమానులు(Prabhas Mother Comments).

వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలో వీరి కెమిస్ట్రీ ఆడియన్స్ కి పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఆన్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ జంటకు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో వీరిద్దరూ రియల్ లైఫ్ లో జోడీ అయితే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. అటు అనుష్క కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీంతో వీరిద్దరికి పెళ్లి కచ్చితంగా జరుగుతుందని నమ్మేవాళ్లు చాలామంది ఉన్నారు. ఇక ఇప్పుడు.(Prabhas Mother Comments)

ప్రభాస్ అభిమానులు AI టెక్నాలజీ సాయంతో ప్రభాస్ కి ఒక ఫ్యామిలీ ని క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ప్రభాస్ కి భార్యతో పాటు వీరికి పిల్లలు కూడా ఉన్నారు. ఇంతకూ ఈ ఫోటోలో ప్రభాస్ భార్య గా కనిపిస్తుంది ఎవరో కాదు. అనుష్క కావడం విశేషం. అనుష్క కి ప్రభాస్ కి పెళ్లి జరిగినట్లుగా.

వీరికి ఒక పాప బాబు ఉన్నట్టుగా ఫొటోలు డిజైన్ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ప్రభాస్ ఎలాగో పెళ్లి చేసుకోవట్లేదు మీరే పెళ్లి చేసేసారు రా బాబు అని కామెంట్స్ చేస్తున్నారు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University