Cinema

Samantha : సినిమాలకు బ్రేక్ చెప్పబోతున్న నటి సమంత.. కారణం అదేనా..?

Samantha Break From Movies : గత కొద్ది రోజులుగా ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత ఏం చేసినా అది వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. గ్లామర్ షోలకు ఏమాత్రం వెనుకాడని ఈ క్యూట్ గాళ్ ఈ మధ్య కాలంలో బోల్డ్ సీన్స్ లోనూ నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా నెట్టింటకు సంబంధించిన ఓ వార్త బాగా వైరల్ కావడం గమనార్హం. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను సమంత కొల్లగొట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఈ యాపిల్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్‌గా మారిపోయింది.

actress-samantha-is-going-to-stay-away-from-the-movies-is-that-the-reason

తర్వాత అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం వంటివి చకచకా జరిగిపోయాయి. విడాకులు తీసుకున్న తర్వాత చాలా కుంగిపోయింది సమంత. తన మకాం ముంబైకి మార్చేసింది. బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అక్కడకు వెళ్లింది. అక్కడే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సిటాడెల్ ఇండియన్ వెర్షన్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమా చేస్తోంది. ఖుషీ సినిమా షూటింగ్ పూర్తి కావస్తోంది(Samantha Break From Movies).

Vijay Samantha

మరో మూడు రోజుల్లో ఈ సినిమాలో షూటింగ్ కంప్లీట్ అయిపోతుందంట. సిటాడెల్ చిత్రీకరణ కూడా త్వరత్వరగా ఆమె కంప్లీట్ చేయనుందట. ఈ రెండూ పూర్తయిన తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉండనుందని తెలుస్తోంది. సినిమాలకు దూరంగా ఉండాలనే సమంత నిర్ణయంతో ఆమె ఫ్యాన్స్‌ షాక్‌కు గురయ్యారు. అయితే వారికి ఊరటనిచ్చేలా అసలు విషయం తెలిసింది. కేవలం ఒక ఏడాది మాత్రం సినిమాలు చేయకుండా సమంత రెస్ట్ తీసుకోనుందట. ఇప్పటికే ఆమె మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. బాధ పంటి బిగువున అనుభవిస్తూనే శాకుంతలం సినిమా చేసింది.(Samantha Break From Movies)

Samantha

ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే దాని నుంచి బయటపడి తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం తన ఖాతాలో ఉన్న షూటింగ్స్ త్వరత్వరగా కంప్లీట్ చేసేస్తోంది. మయోసైటిస్ బారిన పడినప్పుడు ఆమె కోలుకుంటున్నా ఆ ప్రభావం ఇంకా ఉందని తెలుస్తోంది. గతంలో తాను కుదుర్చుకున్న ఒప్పందాలకు అడ్వాన్సులు తీసుకోవడం వల్లే ఇలా ఈ రెండు సినిమాలను పూర్తి చేసిందట.మరికొన్ని చిత్రాలకు సంబంధించిన అడ్వాన్సులను ప్రొడ్యూసర్లకు తిరిగి ఇచ్చేస్తుంది అని.. ఇక త్వరలోనే ఆమె విశ్రాంతి తీసుకోబోతుందని సమాచారం.

ఈ క్రమంలోనే ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. ఆమె పూర్తిగా కోలుకుంటే వరుస ప్రాజెక్టులను అంగీకరించి మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలోనే స‌మంత సినిమాల‌కి విరామం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకుంది.ఆమె ఆమె పూర్తిగా కోలుకుంటే వరుస ప్రాజెక్టులను అంగీకరించి మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలోనే స‌మంత సినిమాల‌కి విరామం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకుంది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University