NewsTrending

Venu Swamy: కాబోయే సీఎం కేసీఆర్ కాదు .. వేణుస్వామి సంచలన జ్యోతిష్యం..

Venu Swamy Comments: తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యాయి. రేపు ఫలితాలు విడుదల కానుండగా ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎవరు సీఎం కుర్చీ దక్కించుకుంటారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. అయితే సీఎం ఎవరనే విషయంపై ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

astrologer-venu-swamy-sensational-comments-and-predicts-on-cm-kcr-who-will-form-the-governament

గతంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సీఎం ఎవరనేది తేల్చి చెప్పారు. 2023 బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేరని ఆయన వెల్లడించారు. ఈసారి డైరెక్ట్గా కేటీఆర్ సీఎం అవుతారని చెప్పారు. కెటిఆర్ జాతకం ప్రకారం ఆయనకి సీఎం యోగం ఉందని అన్నారు. అయితే 2023 లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం కావాలంటే బలమైన గ్రహాలు అనుగ్రహించాలని చెప్పారు. ఎమ్మెల్యే స్థాయి వేరు మంత్రి స్థాయిరని ముఖ్యమంత్రి కావాలని గ్రహాలు అనుకూలించని అన్నారు(Venu Swamy Comments).

కేసీఆర్‌కు చంద్ర మంగళయోగం ఉందని. అందుకే ఆయన సీఎం అయ్యే పదేళ్లు అధికారంలో ఉన్నా రన్నారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఎవరు సీఎం అవుతారనే దానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. వారి వారి జాతకాలను బట్టి పదవీయోగం ఉంటుందని అన్నారు. అప్పుడు జాతకాలు బట్టి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి లేదా రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఎవరో ఒకరు సీఎం అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. జాతకాలను బట్టి కొన్నిసార్లు శత్రువులు బలహీనతలే మన బలాలు మారుతాయన్నారు. అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.(Venu Swamy Comments)

ఆయన కచ్చితంగా కేటీఆర్ సీఎం అవుతారని చెప్పకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. రేపటి ఫలితాలతో నేతల జాతకాలు తో పాటు స్వామి జాతకం కూడా బయటపడుతుందని కామెంట్లు పెడుతున్నారు. సినీ రంగంలో రాజకీయ రంగంలో సెలెబ్రిటీల గురించి వారి జాతకాల గురించి చెబుతూ వేణు స్వామి కూడా సెలబ్రిటీ అయిపోయారు. జాతకంలోని దోషాలను గుర్తించి ప్రత్యేక ప్రత్యేకంగా పలువురు. సినీ రాజకీయ సెలబ్రిటీలు ఆయన చేత పూజలు చేయించుకున్నారు.

సమంత నాగచైతన్య వివాహం జరిగింది తర్వాత వాళ్లు ఎక్కువ రు కలిసి విడిపోతారని అప్పట్లో వేణు స్వామి చెప్పారు. అయితే అప్పుడెవరూ ఆయన మాటలకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎప్పుడైతే వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి వెనుస్వా మికి డిమాండ్ పెరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమలో పేరుగాంచిన కుటుంబానికి చెందిన నిహారిక కొణిదెల విడాకుల వార్తలతో వార్తల్లో నిలిచింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University