CinemaTrending

Lavanya Tripathi: వరుణ్ పెళ్లిలో లావణ్యకు అత్తకు మధ్య పెద్ద గొడవ.. అసలు ఏమైందంటే.. ?

Lavanya Tripathi Varun Tej: నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తోటి నటి లావణ్యను ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ ప్రేమలో ఉన్నాడు. అందులో భాగంగానే ఈ జంట జూన్ 09న కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. నవంబర్ 1న వీరి వివాహం జరిగింది. ఆరేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట పెద్దల ఆశీస్సులతో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వరుణ్ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం తరలివచ్చారు.

big-fight-between-lavanya-tripathi-aunt-in-varun-tej-wedding-what-actually-happened-is

మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు. ఇక లావణ్య తన పెళ్లిలో కట్టుకున్న చీర గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చీర అసలు ధరపై చర్చ జరుగుతోంది. అయితే ఈ చీరను ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఈ చీర ధర దాదాపు 9 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్‌ను జరుపుకున్నారు. అందులో భాగంగానే వరుణ్, లావణ్యలు తమకు ఇష్టమైన దేశమైన ఇటలీలో పెళ్లి చేసుకున్నారు(Lavanya Tripathi Varun Tej).

ఇటలీలో జరిగిన పెళ్లి వేడుకలో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ తల్లి మధ్య చిన్న గొడవ జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వరుణ్ తేజ్ తల్లి లావణ్య కోసం ప్రత్యేకంగా లెహంగాను తయారు చేసినట్లు సమాచారం. అయితే. ఇటలీలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఆ లెహంగాను ధరించాల్సిందిగా కోరింది. కానీ లావణ్య మాత్రం లెహంగా తనకు అసౌకర్యంగా ఉందని, తాను ప్రత్యేకంగా డ్రెస్ డిజైన్ చేశానని, వేసుకుంటానని చెప్పింది. అయితే ఈ విషయంలో అమ్మానాన్నల మధ్య వాగ్వాదం జరిగింది.(Lavanya Tripathi Varun Tej)

పెళ్లికి ముందు ఏది చెప్పినా చేసే లావణ్య త్రిపాఠిలో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పు చూసి వరుణ్ తేజ్ తల్లి షాక్ అయ్యింది. వరుణ్ కూడా లావణ్యకి సపోర్ట్ చేస్తున్నాడు…నాగబాబు భార్య కాస్త ఫీల్ అయ్యింది. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో కలలు కనే వివాహ వేడుకలో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొద్ది రోజులకే హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఈ జంట తమ సహోద్యోగులకు

స్నేహితులకు హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు, వారి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుందని నివేదికలు విస్తృతంగా ఉన్నాయి. తమ పెళ్లి సినిమాపై వస్తున్న రూమర్లపై ఇప్పుడు వరుణ్ తేజ్ టీమ్ స్పందించింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University