CinemaTrending

Shobha Shetty: ఏడ్చుకుంటూ బయటకు వెళ్లిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ శోభా శెట్టి..

Shobha Shetty Crying: ప్రస్తుతం స్టార్ మాలో రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 7 ప్రసారం అవుతూ ప్రేక్షకులకు ఎంతలా ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందో చూస్తూనే ఉన్నాం. షో ప్రారంభం నుండి ఇప్పటివరకు కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న రచ్చ మామూలుగా లేదని చెప్పాలి. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ అతిమాత్రం లెవల్లో ఉంది. సీరియల్‌లోనే కాదు రియాలిటీ షో లో కూడా నటనతో జీవించేస్తున్నారు.అందులో ఎక్కువగా శోభా శెట్టి మాత్రం చాలా ఓవర్ చేస్తుందని అందరికీ అర్థమైంది. గంటలు, గంటలు మేకప్ వేసుకుంటూ తాని అందగత్తె అని ఫీల్ అవుతుంది.

bigg-boss-telugu-season-7-contestant-shobha-shetty-went-out-from-house-by-crying-for-eliminating-her

అంతేకాదు తోటి హౌస్‌మేట్స్ తో కూడా తను ప్రవర్తించే తీరు చూస్తే మాత్రం తనే టైటిల్ విన్నర్ అంత లెవల్లో అతి చేస్తుంది. తనకి నచ్చని వాళ్ళని బాగా టార్గెట్ చేసి ప్రతివారం నామినేషన్ సమయంలో వారిపై బుసలు కొడుతోంది. ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసి గొడవకు దిగుతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో చూసినట్లయితే తను యావర తో గొడవకు దిగి నానా హంగామా చేసింది. అతన్ని రెచ్చగొట్టి మరీ రెచ్చిపోయింది. దీంతో జనాలు ఈసారి ఎలాగైనా హౌస్ నుండి బయటికి పంపాలని ఫిక్స్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌ లిస్ట్ 8మందిలో తాను కూడా ఉంది(Shobha Shetty Crying).

నిజానికి శోభ ఆరో వారంలోనే పెట్టె సర్దుకోవాల్సింది. కానీ కొన్ని అగ్రిమెంట్ ప్రకారం తాను ఆ వారం సేవ్ అయిందని తెలిసింది. కానీ ఈసారి మాత్రం శోభను ఎలాగైనా పంపాలని జనాలు ఫిక్సయి తనకు ఓట్లు వేయకుండా చివరి స్థానంలో ఉండేలా చేశారు. తను వెళ్లిపోవడం ఖాయం అని జనాలు సోషల్ మీడియాలో గట్టిగా చెప్పేస్తున్నారు. అయితే తను నిజంగానే బయటికి వెళ్లిందని తాజాగా ఓ వీడియో ద్వారా బయటపడింది. తను బిగ్ బాస్ సెట్ నుంచి బయటికి ఒక వైట్ ఇన్నోవా కార్లో ఏడుస్తూ వచ్చినట్లు తెలుస్తుంది.(Shobha Shetty Crying)

మొత్తానికి శోభా వెళ్లిందని వీడియో ద్వారా లీక్ కావడంతో బిగ్ బాస్ హౌస్ నుండి ఒక పెద్ద దరిద్రం పోయిందని జనాలు తెగ సంబరాలు జరుపుకున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ వారం చూడాలి వెళ్ళేది తనేనా కాద అని. తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్7 రోజురోజుకు వేడెక్కుతోంది. ఇప్పటివరకు మహిళా సెలబ్రెటీలు మాత్రమే తొలగించబడుతున్నారు షో ప్రారంభమైన రోజు నుండి ఇది ఒక రకమైన పద్ధతిగా మారింది. అశ్విని ప్రమాదంలో చిక్కుకోవడంతో మరోసారి అదే జరగబోతోందని తెలుస్తోంది.

ఇంతకీ భోలేషావలి ప్రమాదంలో పడింది కానీ గత కొన్ని రోజులుగా అతని క్రేజ్ కాస్త ఎక్కువైంది. ఆడవాళ్ళతో చాలా గొడవలు పడుతున్నాడు అంటూ డ్రామా క్రియేట్ చేస్తూ గత కొద్ది రోజులుగా ఓటింగ్ పెంచుకున్నాడు. అందుకే డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్లు సమాచారం. మరి ఎనిమిది మంది సెలబ్రెటీలు నామినేట్ కావడంతో ఈ ఆదివారం ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University