Cinema

Rajamouli – Venu Madhav : ఆ కమెడియన్ దెగ్గర రాజమౌళి అసిస్టెంట్ గా పనిచేశాడని మీకు తెలుసా..

Rajamouli Venu madhav బాహుబలి సినిమాతో ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. తన పనితీరులో ప్రపంచంలోనే పెద్ద పెద్ద డైరెక్టర్లు సహా మెచ్చుకున్నారు అంటే అయన టేకింగ్ స్క్రీన్ ప్లే ఏ రేంజ్లో ఉంటుందో అర్థం అవుతుంది.. రాజమౌళి చేసింది కొన్నిసినిమాలే అయిన అవి ప్రపంచ పటంలో నిలిచాయి. ఇటీవల అయన చేసిన RRR సినిమా ఆస్కార్ అవార్డ్ ని గెలుచుకొని భారతీయ సినిమాకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. ఇంతటి కీర్తిప్రతిష్టలు తెచ్చుకున్న రాజమౌళి ఒకప్పటి కమిడియన్ వేణుమాధవ్ కి అసిస్టెంట్ గా చేశారని మీకు తెలుసా.

rajamouli-venu-madhav

ఇది మీకు ఆశ్చర్యం కలిగించే విషయం కానీ ఇది నిజం. కానీ నిజజీవతంలో కాదండీ ఒక సినిమాలో వేణుమాధవ్ కి అసిస్టెంట్ గా చేశారు. 2004లో రాజమౌళి దర్శకుడిగా చేసిన మూడవ చిత్రం సై. నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సీనిమలో వేణుమాధవ్ కమిడియన్ గా చిన్న పాత్ర పోషించారు. నల్ల బాలు నాకి చంపేస్తా అంటూ వేణుమాధవ్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఇక సై చిత్రంలో రాజమౌళి వేణుమాధవ్ కి అసిస్టెంట్ గా కనిపిస్తారు ఇది అసలు విషయం. (Rajamouli Venu madhav)

venu-madhav-rajamouli

రాజమౌళి దర్శకుడు మాత్రమే కాదు మంచి నటుడు కూడా. తాను దర్శకత్వం చేసే సినిమాలో ప్రతి సన్నివేశాన్ని ఎలా నటించాల్లో నటులకు చేసి చూపిస్తాడు అంతేకాదు అయన దర్శకత్వం వహించే సినిమాల్లో చిన్న చిన్న వేషలు కూడా వేస్తారు. ఈగ, మగధీర, సై, బాహుబలి వంటి చిత్రాలు. ఇకపోతే నెక్స్ట్ మూవీ పనులతో చాలా బిజీ గా వున్నాడు రాజమౌళి. 800ల కొట్ల బడ్జెట్ మహేష్ బాబు హీరో గా రాజమౌళి తెరకెక్కించే చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నారు. వేణు మాధవ్ ఒక భారతీయ నటుడు మరియు హాస్యనటుడు, ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన పనికి పేరుగాంచాడు.

venu-madhav

అతను డిసెంబర్ 30, 1979న భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించాడు. వేణు మాధవ్ 170కి పైగా చిత్రాలలో కనిపించాడు మరియు అతని హాస్య సమయము మరియు బహుముఖ ప్రదర్శనలకు ప్రజాదరణ పొందాడు. వేణు మాధవ్ 1996లో “సంప్రదాయం” అనే తెలుగు సినిమాతో తన నటనా రంగ ప్రవేశం చేసాడు. కామెడీలో తన ప్రతిభతో త్వరగా గుర్తింపు పొందాడు మరియు పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడిగా స్థిరపడ్డాడు.

అతను అగ్ర నటులతో కలిసి నటించాడు మరియు “చిరంజీవులు,” “నువ్వు నేను,” “ఇడియట్,” మరియు “అతడు” వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో కనిపించాడు. వేణు మాధవ్ తన ప్రత్యేకమైన వ్యక్తీకరణలు, డైలాగ్ డెలివరీ మరియు హాస్య పాత్రలతో ప్రేక్షకులను అలరించే సామర్థ్యానికి ప్రసిద్ది చెందారు.

Priya Reddy

#Foodie #MovieLover Iam Priya from hyderabad, I love writing content Especially on Movies. Love eating Mirchi bajji While Its Raining