CinemaTrending

Yadamma Raju: తీవ్ర దుఃఖం లో యాదమ్మ రాజు.. మిస్ యూ అంటూ ఏడుస్తూ వీడియో..

Yadamma Raju Emotional Post: యాదమ్మ రాజు స్టెల్లా ఈ మధ్య బుల్లితెర మీద బాగా కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. పటాస్ కామెడీ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న యాదమ్మ రాజు. ఆ తర్వాత పలు కామెడీ షోలు చేస్తూ బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. జబర్దస్త్ ఎక్స్‌ట్రా జబర్దస్త్ తో ఎంతో పాపులర్ అయిన యాదమ్మ రాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెర కామెడీ షో ద్వారా యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న వారిలో యాదమ్మ రాజు కూడా ఒకరు.

famous-show-pataas-and-jabardasth-comedian-yadamma-raju-and-stella-emotional-post

ఆయన కామెడీ టైమింగ్ కి ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాంటి యాదమ్మ రాజు తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో రీసెంట్ గా పోస్ట్ పెట్టాడు. అక్టోబర్ 3 నాకెప్పటికీ గుర్తుండిపోయే రోజు ఎందుకంటే నన్ను ఎల్ కేజీ నుండి పదో తరగతి వరకు చదువు చెప్పి నేను ఎలా ఉండాలో నేర్పించే ఎన్నోసార్లు నా తప్పులను కొట్టి డిసిప్లిన్ నేర్పించి స్కూల్ ఫీజులు కట్టలేని టైంలో నా స్కూల్ ఫీజులు కట్టి నన్ను చదివిచ్చిన మా ప్రిన్సిపల్ సర్ ని మిస్ అవుతూనే ఉంట. రెస్ట్ ఇన్ పీస్ డాక్టర్ ఫెడ్రిక్ ఫ్రాన్సిస్ సర్ ఎంతోమందికి చదువు చెప్పిన గురువు అని పోస్ట్ చేసాడు(Yadamma Raju Emotional Post).

ఎవరిని ఎవరూ పట్టించుకోని రోజుల్లో యాదమ్మ రాజు మాత్రం తన సర్ ని ఇంకా గుర్తు పెట్టుకుని ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సర్ మీద చూపిస్తున్న అభిమానానికి నెటిజన్స్ ఖుషి అవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక యాదమ్మ రాజు తన లైఫ్‌లో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాడనే విషయాన్ని చాలా ఇంటర్వ్యూలో చెబుతూనే ఉంటాడు.స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. బుల్లితెర మీద ప్రసారమయ్యే అన్ని ఈవెంట్స్ షో లో ఈ జంట కనిపిస్తూనే ఉంటారు.(Yadamma Raju Emotional Post)

జబర్దస్త్ లో ఆనాటి నవ్వులు. ఈనాడు కనుమరుగైపోయాయి అని ఎంతమందికి బాధగా ఉంది. ఇది జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో కింద ఓ యూజర్ పెట్టిన కామెంట్. ఒకరు ఇద్దరికి ఇలా అనిపిస్తే ఏదో అనుకోవచ్చు. కానీ ఈ మధ్య చాలా మంది ఆడియన్స్ ఇలానే విసిగిపోయారు. ప్రోమో వచ్చినప్పుడు ఈసారైనా కామెడీ ఉంటుందేమోనని ఆశగా రావడం. చూసిన తర్వాత మళ్లీ నిరాశగా కామెంట్ పెట్టి వెళ్లిపోవడం ఇదే పరిస్థితి.

ఇక లేటెస్ట్ ప్రోమో లో కామెడీ కంటే జడ్జి ఇంద్రజ నోటి నుంచి వచ్చి బోల్డ్ డైలాగ్ గట్టిగా పేలింది. అయి తే ఇంద్రజ నుంచి ఇలాంటి డైలాగ్ విని అక్కడ సెట్‌లో ఉన్నవాళ్లతో పాటు విన్నవాళ్లు కూడా అవాక్కయ్యారు. మరి ఇంద్రజ ఏమన్నారో చూద్దాం.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University