Cinema

Jawan : షారుక్ ఫాన్స్ కి పూనకాలే.. జవాన్ ట్రైలర్ వచ్చేసింది..

Jawan Trailer : తమిళంలో దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న అట్లీ ఇప్పుడు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ హీరో గా నటిస్తున్న జవాన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతో అలరించింది. షారుఖ్ ఖాన్ తో డైరెక్ట్ చేస్తున్న సౌత్ దర్శకుడిగా ఈ డైరెక్టర్ ఉన్నాడు. అంతకుముందు కొంతమంది చేసినా ఇప్పుడు మాత్రం ఈ దర్శకుడే ఈ ఘనత సాధించాడని చెప్పాలి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా దీనికంటే ముందు పఠాన్ అనే సినిమా లో నటించాడు షారుఖ్.

jawan-movie-trailer-is-out-now-good-news-for-shah-rukh-khan-fans-this-movie-had-earn-100s-of-crores-before-it-release

తమిళంలో మంచి సినిమాలు చేసి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాడు అట్లీ. విజయ్ తో మెర్సల్, బిగిల్ వంటి సినిమాలతో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. తెలుగు లో కూడా ఈ దర్శకుడితో సినిమా చేయాలనీ కొంతమంది కోరుకున్నారు. కానీ అది అల్లు అర్జున్ నే వరించింది. త్వరలోనే వీరి కాంబో లో సినిమా రాబోతుంది. ఈ సినిమా పై నార్త్ తో పాటు సౌత్ అంచనాలు అత్యంత భారీగా నమోదయ్యాయి.ఇదిలా ఉండగా.. జవాన్ మూవీ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది(Jawan Trailer).

deepika vijay sethupathi nayanthara

జవాన్ సినిమా నుండి డైరెక్ట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. దీంతో సోషల్ మీడియాలో జవాన్ ట్రెండ్ అవుతోంది. అనేది కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇక జవాన్ ట్రైలర్ విషయానికి వస్తే.. దర్శకుడు అట్లీ మార్క్ తోనే పూర్తి అయిందని చెప్పాలి. దీని నిడివి రెండు నిమిషాల పన్నెండు సెకన్లు. ఇందులో ఎక్కువ భాగం యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండిపోయిందనే చెప్పాలి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు.(Jawan Trailer)

Shah rukh khan jawan

రీసెంట్ గా ఈ సినిమాపై భారీ హైప్స్ వస్తున్న నేపధ్యంలో మ్యూజిక్ రైట్స్ విషయంలో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా మరో రికార్డు క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ట్రైలర్ విడుదలకు సన్నాహాలు జరుగుతుండగా.. జవాన్ థియేటర్ హక్కులు రూ.250 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది. నిజంగానే ఈ సినిమాకి ఇంత థియేట్రికల్ రైట్స్ రావడంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న షారుఖ్ ఇప్పుడు ఆయన సినిమాలు సూపర్ హిట్ అవుతూ ఉండడంతో.

పాటు సినిమా రైట్స్ విషయంలో కూడా పలు రికార్డులను సైతం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎలిమెంట్స్ తో అద్భుతమైన నటనతో ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న జవాన్ సినిమా ట్రైలర్. అట్లీ గత సినిమాల్లానే ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉన్నట్టు స్పష్టమవుతుంది. షారుఖ్ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్ , విజువల్స్ అన్నీ గ్రాండ్ ఉన్నాయి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University