NewsTrending

Jr Ntr: చంద్రబాబు బెయిల్ పై ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే.. ఇన్ని రోజులకు నోరు విప్పాడుగా..

Jr Ntr Reaction: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని సెప్టెంబర్ 9 న స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మరుసటి రోజు చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. అలా రాజమండ్రి జైలులో దాదాపు 53 రోజులపాటు ఉండగా నేడు ఆయనకి మత్యంతర బెయిల్ మంజూరైంది. గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ప్రభుత్వానికి 371 కోట్ల రూపాయల నష్టం ఎదురైంది. దీంతో చంద్రబాబు సూత్రధారి అని సాక్ష్యాలు కూడా వెలువడ్డాయి. దీంతో చంద్రబాబుని అరెస్ట్ చేయకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందని అరెస్ట్ చేశారు.

jr-ntr-reaction-on-nara-chandra-babu-naidu-skill-development-case-bail-detials-here

అలా చంద్రబాబు ని అరెస్ట్ చేయడంతో ఆయన భార్య, కోడలు బ్రాహ్మణి కొడుకు లోకేష్‌తో పాటు పార్టీ నేతలు రోడ్డుపై కూర్చొని నిరసన చేశారు. ఆయన ప్రజల కోసం కష్టపడ్డారని, తప్పు చేయలేదని, ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని అన్నారు. అలా చంద్రబాబు జైలు లో ఉన్నన్ని రోజులు నారా కుటుంబం ఆయన కోసం బాగా పోరాటం చేశారు. అయితే ఆ సమయంలో ఎక్కడ కూడా ఎన్టీఆర్ ఈ విషయం గురించి రియాక్ట్ అయినట్లుగా అనిపించలేదు. అయితే నేడు హై కోర్ట్ చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది(Jr Ntr Reaction).

ఇక నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. ఇక మధ్యంతర బెయిల్ కి కారణం చంద్రబాబు అనారోగ్య కారణాల తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అయిన కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, దీంతో ఆయన దాదాపు ఐదు కేజీలు బరువు తగ్గాడని తెలిసిందే. ఇక వైద్యులు కూడా కొన్ని పరీక్షలు చేయాలని సిఫార్సు చేయడంతో ఆయనకి కుడి కన్ను చూపు మందగించడంతో అత్యవసరంగా కంటికి శస్త్రచికిత్స చేయాలని ప్రభుత్వం డాక్టర్ వెల్లడించారని తెలిసింది. దీంతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.(Jr Ntr Reaction)

నాలుగు వారాల పాటు అంటే నవంబర్ 24 వరకు అనుమతిచ్చింది. చంద్రబాబుకి బెయిల్ రావడంతో ఈ రోజు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదల కావడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులు సంతోషంలో ఉన్నారు. ఆయన బయటికి రాగానే పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికి ఆ తర్వాత చికిత్స కోసం తీసుకెళ్తారని తెలిసింది. అయితే ఇదంతా ఇలా ఉంటే ఇప్పటి వరకు చంద్రబాబు జైలు ఉంటే ఎన్టీఆర్ మాత్రమే రియాక్ట్ కాక పోగా.

తాజాగా చంద్రబాబు పేరుపై ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యాడని తెలిసింది. ఆయన రాక తమకు సంతోషంగా ఉందని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, ఇప్పుడు కూడా చంద్రబాబు గారి గెలిచారని. తర్వాత గెలుపుకి ఆయనకు ఇదొక ప్లస్ పాయింట్ అని అన్నట్లు తెలిసింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University