CinemaTrending

Krishna Mukunda Murari: కృష్ణ ముకుందా మురారి హీరోయిన్ కృష్ణ రియల్ స్టోరీ అసలు నిజాలు..

Krishna Mukunda Murari: తెలుగు బుల్లితెరపై స్టార్ మాలో ప్రసారం అవుతున్న కృష్ణా ముకుందా మురారి సీరియల్ అతి తక్కువ సమయంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుందనే చెప్పాలి. మంచి స్టోరీతో వస్తున్న ఈ సీరియల్ రేటింగ్ పరంగా కూడా బాగా దూసుకుపోతోంది. ఇక ఈ సీరియల్‌లో నటిస్తున్న నటీ నటుల గురించి మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా కృష్ణ పాత్రలో నటిస్తున్న హీరోయిన్. అంటే విపరీతమైన అభిమానం చూపిస్తున్నారు. జనాలు చూడటానికి చాలా అందంగా ఉంటూ చూపు తిప్పుకోకుండా చేస్తోంది.

krishna-mukunda-murari-serial-actress-prenana-kambam-real-story-and-facts

మరి ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆమె రియల్ స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కృష్ణ అసలు పేరు ప్రేరణ కంభం. ఈమె 1996లో హైదరాబాదులో జన్మించాడు. అక్కడే తన ఇంటర్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఫ్యామిలీ అంతా బెంగళూరు లో సెటిల్ అయింది. ఇక అక్కడ తన బీటెక్ చదువు పూర్తి చేసింది. ఈమె తల్లి తండ్రి పేరు రూపా, గురు. ఈమెకు ఒక చెల్లి కూడా ఉంది. ఆమె పేరు ప్రకృతి. ప్రకృతి ప్రస్తుతం తన స్టడీస్ లో బిజీగా ఉంది ఇక ప్రేరణ కి చిన్నప్పటి నుండి నటన పట్ల బాగా ఇంటరెస్ట్ ఉండడంతో(Krishna Mukunda Murari).

చదువు పూర్తవ్వగానే మోడల్ రంగంలోకి అడుగుపెట్టింది. కన్నడ సీరియల్స్‌తో తన నటనా జీవితాన్ని పరిచయం చేసింది. అలా తను రంగనాయకి అనే సీరియల్‌లో తొలిసారిగా నటించింది. అంతేకాదు పలు సినిమాలు వెబ్ సిరీస్‌లు కూడా చేయగా అక్కడ కూడా నటిగా మంచి పేరు సంపాదించుకుంది. వారిని అభిమానులుగా మార్చుకుంది. ఆ తర్వాత తాను కృష్ణా ముకుందా మురారి అనే సీరియల్‌లో తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులకు పరిచయమైన అందులో తన అమాయకత్వలు వారిని ఆకట్టుకుంది. (Krishna Mukunda Murari)

ఇక ప్రేరణ కి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆమె కన్నడ డాన్స్ షోలో పాల్గొని తన డాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఈమెకి లాంగ్ డ్రైవ్ పార్టీ అంటే చాలా ఇష్టం. ఇక ఈమె తనతో కలిసి కన్నడ సీరియల్‌లో నటించిన హీరో పవన్ రవీంద్రతో బాగా క్లోజ్గా ఉంటుంది. అతడు తెలుగులో వైదేహి పరిణయం సీరియల్లో చేస్తున్నాడు. అయితే వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి కన్నడ ప్రజలు వీరి మధ్య ఏదో నడుస్తుందని అనుకున్నారు. కానీ తమ మధ్య అటువంటిదేమీ లేదని, కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని గతంలో కన్నడ ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలిసిందే.

ఇక ప్రేరణ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది. బాగా వీడియోలు చేస్తూ ఫాలోవర్స్కి షేర్ చేసుకుంటూ ఉంటుంది. సీరియల్ షూటింగ్ సమయంలో కాస్త బ్రేక్ దొరికితే చాలు కో ఆర్టిస్టులతో సరదాగా వీడియోస్ చేస్తుంది. అలా సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇక ఈమెకి సొంతంగా ఒక కార్ ఉంది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University