Polimera 2 : మా ఊరి పొలిమేర 2 టీజర్ వచ్చేసింది.. ఒక్కో సీన్ చూస్తుంటే పిచ్చెక్కిస్తుంది..
Polimera 2 Teaser : సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను మరియు ఇతరులు నటించిన గ్రామీణ థ్రిల్లర్ మా ఊరి పొలిమెర, అద్భుతమైన స్పందనలతో నేరుగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది మరియు 2021లో స్ట్రీమర్‌లో అత్యధికంగా వీక్షించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. మర్డర్ మిస్టరీ మరియు బ్లాక్ మ్యాజిక్ క్లిఫ్హ్యాంగర్ ముగింపును కలిగి ఉంది, ఇది సీక్వెల్‌ను సూచిస్తుంది. సినిమా లో కంటెంట్ ఉంటె హీరో హీరోయిన్ ల తో పని లేకుండానే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యితుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటికి మన సినీ ఇండస్ట్రీ లో అలంటి మూవీ చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా వెండితెరపై అయినా ఓటీటీలో అయినా సరే కంటెంట్ వైవిధ్యంగా ఉండే చిత్రాలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఇలాంటి వాటిలో వచ్చిన సినిమా నే మా ఊరి పొలిమేర. ఈ చిత్రం 2021 లో డైరెక్ట్ గా ఓటిటి రిలీజ్ అయ్యింది. ఉహిచని రెస్పాస్ సొతం చేసుకుంది. ఇందులో కమెడియన్ సత్యం రాజేష్ క్షుద్ర మాంత్రికుడిగా. మాత్రలు, తంత్రాలు, క్షుద్ర పూజలు ఇలాంటి వివిధమైన అంశాలతో ఈ సినిమా ని తెరకేకించారు(Polimera 2 Teaser).
అప్పట్లో ఈ సినిమా ఓటిటి లో బారి సంచలనం సృష్టించింది. ఇక ఇలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చిన విరూపాక్ష చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఇప్పుడు పొలిమేర 2 కూడా వస్తోందంటే సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. పొలిమెరా 2 ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలై వైరల్‌గా మారింది. ఇందులో కమెడియన్ సత్యం రాజేష్ క్షుద్ర మాంత్రికుడిగా నగ్నంగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఆ సన్నివేశాలు ప్రేక్షకులను భయపెడుతున్నాయి.(Polimera 2 Teaser)
టీజర్ చూస్తుంటే మొదటి పార్ట్ ని మించిపోయేలా ఈ సెకండ్ పార్ట్ ఉండబోతోందని తెలుస్తుంది. ఈసారి కచ్చితంగా ప్రేక్షకులను థియేటర్లలోకి వచ్చేలా చేయబోతున్నాడు దర్శకుడు. టీజర్ చివర్లో ఉత్కంఠను మరింత పెంచేలా సినిమా ఇతివృత్తాన్ని వివరించే డైలాగ్ ఉంది.. ప్రాణం తీసుడు తప్పు కాదా మామ అని అంటే ప్రాణం తీసాడు తప్పు కానీ బలిస్తే తప్పేంది అనే ఒక డైలాగ్ ఈ చిత్రం థీమ్ ను వివరిస్తోంది.
అనిల్ విశ్వనాథ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. ఈ సినిమా టీజర్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంచ్ చేశారు. ఈ సినిమా టీజర్ చూస్తుంటే బ్లాక్ బస్టర్ అనిపించేలా ఉంది.