Cinema

Mahesh Babu : మహేష్ బాబు కార్ కల్లెక్షన్ విలువ ఎంతో తెలుస్తే దిమ్మ తిరుగుతుంది..

Mahesh Babu SuperCars : మహేష్ బాబు తన తాజా కొనుగోలు యొక్క విలాసాలను ఆస్వాదిస్తూనే, అతను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన రాబోయే చిత్రం ‘గుంటూరు కారం’లో కూడా బిజీగా ఉన్నాడు. నటీనటులు మరియు సిబ్బందిలో మార్పులు, సృజనాత్మక వ్యత్యాసాలు మరియు మరిన్నింటితో సహా వివిధ కారణాల వల్ల ఈ చిత్రం ముఖ్యాంశాలను సృష్టిస్తోంది. ఈ చిత్రంతో మొదట్లో మహిళా ప్రధాన పాత్ర మరియు సంగీత స్వరకర్తగా సంబంధం ఉన్న పూజా హెగ్డే మరియు S థమన్ ఇకపై ప్రాజెక్ట్‌లో భాగం కాదని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి.

if-you-know-the-value-of-superstar-mahesh-babu-super-car-collection-you-will-be-amazed

పుకార్ల ప్రకారం, షూటింగ్ షెడ్యూల్ మరియు స్క్రిప్ట్‌లో మార్పుల కారణంగా పూజా హెగ్డే ఈ చిత్రం నుండి తప్పుకుంది. సంయుక్త మరియు మీనాక్షి చౌదరి వంటి పేర్లను పరిగణనలోకి తీసుకోవడంతో మహిళా ప్రధాన పాత్రను భర్తీ చేయడం ఊహాగానాలకు సంబంధించిన అంశం. నటీనటులు మరియు సిబ్బంది చుట్టూ అనిశ్చితులు ఉన్నప్పటికీ, షూటింగ్ రేపు పునఃప్రారంభం కానుంది, ఇది ప్రొడక్షన్ ముందుకు సాగుతున్నట్లు సూచిస్తుంది. టాలీవుడ్ లో ఎంతో మంది కార్ల ప్రేమికులు ఉన్నారు. అందులో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా ఒక‌రు(Mahesh Babu SuperCars).

Mahesh Babu Cars

తాజాగా కూడా ఓ కొత్త కారు కొన్నాడు. అదేంటంటే గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారును త‌న సొంతం చేసుకున్నారు. ఈ కారులో ఎన్నో లగ్జరీ సౌకర్యాలు ఉంటాయి. అన్న‌ట్లు ఈ కారు ధ‌ర రూ. 4 కోట్లు. అయితే ఈ కొత్త కారుతో పాటు మ‌హేష్ బాబు గ్యారేజ్ లో చాలానే ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ తెలిస్తే దిమ్మ తిరుగుద్ది. మ‌హేష్ బాబు గ్యారేజ్ లో సేద తీరుతున్న ల‌గ్జ‌రీ కార్ల‌లో మెర్సిడెస్ GLS 300D ఒక‌టి. ఆ కారు ధ‌ర రూ.88 ల‌క్ష‌లు. అలాగే మెర్సిడెస్ నుంచి మ‌రొక కారును కూడా మ‌హేష్ బాబు కొనుగోలు చేశారు.(Mahesh Babu SuperCars)

Mahesh Babu

మెర్సిడెస్ బెంజ్ GLS 450. ఈ కారు ధ‌ర రూ. 1.11 కోట్లు. అలాగే మ‌హేష్ బాబుకు బీఎండ‌బ్లూ 730 Ld అనే మ‌రో కారు ఉంది. ఆధునిక సౌక‌ర్యాల‌తో అత్యంత విలాసంగా ఉండే ఈ కారును మ‌హేష్ ఫారెన్ లో ఎగ‌మ‌తి చేసుకున్నారు. ఈ కారునే మ‌హేష్ బాబు అత్య‌ధికంగా వినియోగిస్తుంటారు. ఈ కారు ధ‌ర చెప్ప‌లేదు క‌దూ.. రూ. 1.31 కోట్లు.

మ‌హేష్ బాబు గ్యారేజ్ లో సేద తీరుతున్న మ‌రొక ల‌గ్జ‌రీ కారు టయోటా ల్యాండ్ క్రూయిజ‌ర్ వి8. ఈ కారులో రైడ్ ఎంతో సౌక‌ర్యంగా ఉంటుంది. ఈ కారు ధ‌ర రూ. 1.50 కోట్లు. ల్యాండ్ రోవ‌ర్ రేంజ్ రోవ‌ర్ వోగ్ అనే మ‌రో కారును గ‌తంలో మ‌హేష్ బాబు కొనుగోలు చేశారు. ఈ కారు ధ‌ర రూ. 2.41 కోట్లు.

మహేష్ బాబు ఇటీవల కొనుగోలు చేసిన కార్లలో ఆడి ఎ8ఎల్ ఒకటి. ఈ లగ్జరీ కారు ధర రూ. 1.81 కోట్లు. మహేష్‌కి చెందిన మరో సూపర్‌ కారు లంబోర్గిని గల్లార్డో. దీని ధర రూ. 2. 80 కోట్లు.

ఇవి కాకుండా మహేష్ బాబు దగ్గర రూ. 6 కోట్ల విలువైన వ్యానిటీ వ్యాన్ కూడా ఉంది. వాటి మొత్తం విలువ రూ. 20 కోట్లకు పైగా ఉంటుందనడంలో సందేహం లేదు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University