CinemaTrending

Roja: నా భార్య వీడియోలు నాకు చూపించండి.. రోజా భర్త సెల్వమణి సంచలన డిమాండ్..

Roja Husband Selvamani: ఏపీ టూరిజం మంత్రి ఆర్ కే రోజాపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన అసభ్యకరమైన, అసహ్యమైన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను సంస్కారం ఉన్నవాళ్లు ఎవరూ సమర్థించనని కామెంట్ మహిళాలోకం నుంచి బలంగా వినిపించాయి. ఈ సమయంలో రోజా భర్త సెల్వమణి స్పందిచారు. అవును మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన భూతు పురాణంపై ఇప్పటికీ తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ సీరియస్‌గా రియాక్ట్ అయింది.

minister-roja-husband-rk-selvamani-challenges-to-tdp-leaders-show-me-my-wife-videos

బండారు పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసింది. ఈ సమయంలో ఆ అసభ్య వ్యాఖ్యలపై రోజా భర్త ఆర్ కె సెల్వమణి రియాక్ట్ అయ్యారు. రోజా గురించి ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో చూడగలిగినంత మాత్రమే చూడగలిగానని తెలిపారు. ఈ సందర్భంగా రోజా రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పినప్పుడే. డోంట్ క్రై అని చెప్పినట్లు సెల్వమణి తెలిపారు. రాజకీయాల్లో మగవాళ్లపై అవినీతి ఆరోపణలతో విమర్శిస్తే ఆడవారిని విమర్శించాల్సి వచ్చినప్పుడు మాత్రం క్యారెక్టర్స్ అసాసినేట్ చేస్తారని అది తట్టుకొని నిలబడగలిగితే రాజకీయాల్లోకి వెళ్లమని చెప్పినట్లు తెలిపారు(Roja Husband Selvamani).

ఇదే సమయంలో ఇలాంటి నీచమైన సంఘటనలు జరిగినప్పుడు ఖండించడం అవసరమని చెప్పిన సెల్వమని, ఈ విషయంపై లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో తన భార్యకి సంబంధించిన వీడియోలు అంటే వెంటనే బయట పెట్టాలని తాను సత్యనారాయణకి చెబుతున్నట్లు సెల్వమణి అన్నారు. ఇదే సమయంలో తనకి బాలకృష్ణ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉందని తెలిపిన సెల్వమణి. బ్రాహ్మిణి చాలా చిన్నగా ఉన్నప్పుడే రోజా బాలయ్య సినిమా షూటింగ్‌లో కలిసినట్లు తెలిపారు.(Roja Husband Selvamani)

ఇదే సమయంలో మగాడు అంటే ఆడమనిషి బెదిరించడం కాదని చెప్పిన మాటపై నిలబడేవాడిని సెల్వమణి బండారికి ఇచ్చిపడేశారు. ఇదే సమయంలో మహిళలను కించపరిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని కఠినమైన శిక్షలు ఉంటాయనే విషయం నిరూపించడం కోసమైనా తాము ఈ విషయంలో లీగల్ యాక్షన్కి దిగుతున్నామని సెల్వమణి ప్రకటించారు. ఇదే సమయంలో తన భార్యను ఎవరో ఏదో అన్నారని చంద్రబాబు ఇలాంటి నీచపు పార్టీ లో పెట్టుకొని నడిపిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తన భార్య ఏమైనా తప్పుగా మాట్లాడితే తాను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కానీ.

ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం సరైన పద్ధతి కాదని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ కూతురు ఎన్టీఆర్ కొడుకు ఎన్టీఆర్ కోడలు అని చెబుతున్న వ్యక్తులే ఎన్టీఆర్ ని చెప్పుతో కొట్టారని ఆయన చంపేశారని సెల్వమని ఫైర్ అయ్యారు. ఫైనల్ గా ఏదేమైనా ఈ విషయాన్ని వదిలే ప్రసక్తి లేదని లీగల్‌గా ప్రొసీడ్ అవుతామని బండారు సత్యనారాయణ వీడియోలు చూపించారని తెలిపారు సెల్వమని.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University