CinemaTrending

Pawan Kalyan: ఎన్టీఆర్ ని వెంట్రుక కూడా పీకలేరు.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

Pawan Kalyan Sensational Comments: చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ రియాక్ట్ అవుతున్నారు. చంద్రబాబుకు మేమంతా ఉన్నాం అంటూ ప్లకార్డు ప్రదర్శిస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి మాత్రం నట్టికుమార్ మినహా ఎవరు ముందుకు వచ్చి మాట్లాడలేదు. నిర్మాత సురేష్ బాబు అయితే ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య కాదని. అన్ని పార్టీలు ఆందోళన వ్యక్తులు సినిమా ఇండస్ట్రీ కావాల్సిన వారేనని ఆమెకి సున్నితమైన ఈ సమస్యపై ఎవరూ మాట్లాడటం లేదంటూ ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో చెప్పుకొచ్చారు.

power-star-pawan-kalyan-sensational-comments-junior-ntr-about-chandrababu-naidu-arrest

నిజంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ఎవరు మద్దతు తెలపలేదు. ఇదే విషయంపై తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ మీద చాలా ఒత్తిడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్పందించడానికి కూడా సినిమా వాళ్లు భయపడతారు. గతంలో మేము ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు పోలిటిక్స్ కి సంబంధించి సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి(Pawan Kalyan Sensational Comments).

కృష్ణగారు, ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి వారంతా కాంగ్రెస్ పార్టీలోకి సపోర్ట్‌గా ఉన్నారు. ప్రతి పార్టీకి సినిమా ఇండస్ట్రీ నుంచి బేసిక్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు వైసీపీ కూడా ఉంది. నాకు సపోర్ట్ ఉందని కూడా నేను గట్టిగా చెప్పలేను. అసలు విషయంపైనే ఎప్పుడు దృష్టి కూడా పెట్టలేదు. సినిమా పరిశ్రమ అనేది వండర్ఫుల్ ఇండస్ట్రీ. అది పొలిటికల్ పార్టీ కాదు. ఇందులో కళాశాల కళాకారులతో పాటు 24 శాఖల్లో పనిచేసే వ్యక్తులు ఉంటారు. అందుకే ఎవరూ పొలిటికల్ హీట్ని వారు డైరెక్ట్ గా తీసుకోలేదు. వాళ్ళకి బంధు సమస్యలు ఉంటాయి. వాళ్ళ బాధ నేను అర్థం చేసుకోగలను.(Pawan Kalyan Sensational Comments)

అలాంటి వారు బాధపడడం లేదా ఎలాంటి అభిప్రాయం లేదని అనలేం. ఒకవేళ ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్లను వైసీపీ వాళ్లు టార్గెట్ చేసేస్తారు. ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయనమితీయ సినిమా లేదు. మండలాధీశుడు నుంచి తీస్తూనే ఉన్నారు. కోటగారు పృద్వి గారు ఎన్టీఆర్‌గారి క్యారెక్టర్ లో నటించారు. ఇన్ని తీసినా ప్రభుత్వం తరఫునుంచి కక్ష సాధింపు చర్యల వంటివి ఎప్పుడూ జరగలేదు. ఆతర్వాత కలిసి కూడా ఆక్ట్ చేశారు. కానీ ఇప్పుడా ఆపరిస్థితి లేదు. ఏం మాట్లాడాలన్నా భయంతో ఉన్నారు.

ఎక్కడికో ఎందుకు ఒక సీనియర్ ఆక్టర్ దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రజాభిమానం కలిగిన వ్యక్తి సూపర్‌స్టార్ రజనీకాంత్ గారు చంద్రబాబు గారి గురించి చెప్పారని ఎలా తిట్టారో చూశారు కదా ఆయనని తిట్టని తిట్టు లేదు. అలాంటి ఆయన్ని అలా చేస్తే ఇక్కడున్న సినిమా ఇండస్ట్రీకి చెందినవారు అటువంటి వాళ్ళ నోట్లో పడాలి ఎవరు కోరుకుంటారు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University