Cinema

Raghava lawrence : వినాయక చవితికి వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతున్న చంద్రముఖి 2..

Raghava lawrence : స్టార్ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ నటిస్తున్న తాజా చిత్రం ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కథానాయికగా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందించి పేరు తెచ్చుకున్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ దర్శకుడు పి.వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 18 ఏళ్ల క్రితం పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

raghava-lawrence-chandramukhi-2-is-getting-a-worldwide-grand-release-for-vinayaka-chavithi

హారర్ జానర్‌లో కొత్త సంచలనం సృష్టించిన చంద్రముఖికి సీక్వెల్‌గా ఇప్పుడు చంద్రముఖి 2 రూపొందుతోంది. దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో ఇది 65వ చిత్రం. లైకా ప్రొడక్షన్స్‌ సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ‘చంద్రముఖి 2’ భారీ బడ్జెట్‌తో వినాయక చవితి సందర్భంగా విడుదలవుతోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఆంథోని ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది వినాయక చవితి విడుదల అని ప్రకటించిన లారెన్స్ ఒక విధంగా కొన్ని స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు షాక్ ఇచ్చాడు(Raghava lawrence).

raghava kangana

ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్‌ సుభాస్కరన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇండియన్‌ సినిమా చరిత్రలో ‘చంద్రముఖి’కి ప్రత్యేక స్థానం ఉంది.. దానికి సీక్వెల్‌గా చంద్రముఖి 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాం. ప్రేక్షకుల అంచనాలను మించి సినిమా ఉంటుంది. వినాయక చవితి సందర్భంగా ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. పోస్టర్‌లో చంద్రముఖిని తాళం వేసి ఉన్న గదిలోకి లారెన్స్ చూస్తున్నట్లు ఉంది. ఈ ఏడాది వినాయక చవితి విడుదల అని ప్రకటించిన లారెన్స్ ఒక విధంగా కొన్ని స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు షాక్ ఇచ్చాడు.(Raghava lawrence)

Kangana Ranaut

పి వాసు గతంలో వెంకటేష్ మరియు అనుష్క ప్రధాన పాత్రలలో చంద్రముఖికి సీక్వెల్ పేరుతో నాగవల్లి చిత్రాన్ని రూపొందించారు. కానీ సినిమా టీమ్‌కి ఇబ్బందిగా మారింది. ఇప్పుడు తాజాగా వస్తున్నాడు, హారర్ చిత్రాలతో లారెన్స్ సాధించిన విజయాల రికార్డు చంద్రముఖి 2కి మంచి ఓపెనింగ్స్ తెస్తుందేమో చూడాలి. ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది.

కంగనా కూడా పోస్టర్‌ను షేర్ చేస్తూ, ‘ఈ సెప్టెంబర్‌లో ఆమె తిరిగి వస్తోంది… మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని రాశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రముఖి 2 సీక్వెల్ చంద్రముఖి 2కి తలుపులు గణేష్ చతుర్థి నుండి తెరవబడతాయని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము’ అని లారెన్స్ ట్వీట్ చేశాడు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University