Cinema

Ram Charan : మరో ప్రముఖ బ్రాండ్ కి అంబాసిడర్ గా రామ్ చరణ్.. జాక్ పాట్ కొట్టేసాడు..

Ram Charan Brand Ambassador : టాలీవుడ్ లో మెగాస్టార్ తనయుడిగా రామ్ చరణ్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న రామ్ చరణ్ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీ వచ్చింది. అందుకే రామ్ చరణ్ రకరకాల బ్రాండెడ్ లకు వస్తున్నాడు. ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారు. రామ్ చరణ్ ఇప్పుడు కమర్షియల్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ram charan is the new brand ambassador of the famous app called meesho and he hit the jackpot

ఇకపోతే చాలామంది ఇప్పుడు పాన్ ఇండియాలో బ్రాండ్ క్రియేట్ చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నేపథ్యంలో కమర్షియల్ బిజినెస్ కంపెనీలు కూడా తమ ప్రాజెక్టులను ప్రమోట్ చేసుకోవడానికి వారిని బ్రాండ్ అంబాసిడర్ గా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంతేకాదు కోట్ల రూపాయల పారితోషకం ఇచ్చి మరి బ్రాండ్ ప్రమోషన్స్ కోసం అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి బడా కంపెనీలు. ఈ క్రమంలోనే ఇప్పుడు కమర్షియల్ బ్రాండ్స్ ప్రమోషన్ చేస్తున్న స్టార్ట్స్ లో మహేష్ బాబు టాప్ లో ఉండగా.. ఆ తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు ఉన్నారు(Ram Charan Brand Ambassador).

Ram charan Meesho

ముఖ్యంగా వీరితోనే ఎక్కువగా అండర్స్మెంటులు చేసుకోవడానికి పలు కమర్షియల్ బిజినెస్ కంపెనీలు ముందుకు ఉండడం గమనార్హం. సమాచారం ప్రకారం రామ్ చరణ్ మరో జాక్ పాట్ కొట్టేశాడు. ఇప్పటికే ఓ మొబైల్ షోరూమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆయన ఇప్పుడు మరో కొత్త బ్రాండ్ ప్రమోషన్‌కు శ్రీకారం చుట్టారు. ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు దుస్తులను అందించే ప్రముఖ ఈ-కామర్స్ యాప్ మీషో బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్ ఇటీవల నియమితులయ్యారు. ఓ ఇంట్రెస్టింగ్ యాడ్ రిలీజ్ చేసి ఆ యాడ్ సినిమా స్టయిల్ లో ఉండడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

Ram Charan

ఈ యాడ్ వీడియోలో రామ్ చరణ్ ఒక వ్యక్తిని పట్టుకోవడానికి తన టీం తో కలిసి ఆపరేషన్ ని మొదలు పెట్టాడు అతని ఐడెంటిఫికెట్ చేస్తారు .ఆ వ్యక్తి వేసుకున్న డ్రస్సుని ఐడెంటిఫై చేయడంతో అతను పట్టుబడతారు ఆ తర్వాత ఎంతకి కొన్నావు ఈ షర్ట్ రూ.6000 అని అడుగుతాడు.. కానీ అతను రూ .600 అని చెబుతారు.. ఏంటి అని అవతల వ్యక్తి ఆశ్చర్య పోయేలా చూస్తూ ఉంటారు. ఎక్కడ కొన్నారు అని అడగగా మీషో అని చెబుతారు. దీంతో మీ షో డైరెక్టుగా ఫ్యాక్టరీ నుంచి పంపిస్తుందని చరణ్ టీమ్ లో ఉన్న మరొక వ్యక్తి చెబుతారు.(Ram Charan Brand Ambassador)

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ కి సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా మీషో ఆప్ విడుదల చేసిన యాడ్ చాలా వైరల్ గా మారుతుంది. మొత్తానికి అయితే కూతురు పుట్టిన తర్వాత ఈయన అదృష్టం భారీగా పెరిగిపోయిందని చెప్పాలి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University