CinemaTrending

Roja: వాడి సంగతి నాకు వదిలేయ్.. అనుసయా కోసం రంగంలోకి దిగిన మంత్రి రోజా..

Roja Anasuya Bharadwaj: ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకరింగ్ తో పాటు వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పదమైన న్యూస్ తో నిలిచే అనసూయ గోకపెట్టి ఏడ్చింది. రీసెంట్ గా అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. కారణం ఏంటనేది తెలియదు కానీ అనసూయ ఏడిచే వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అనసూయ పైకి మాత్రం స్ట్రాంగ్ లేడీ గా కనిపిస్తూ లోపల మాత్రం ఇంత బాధ ఎందుకు అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

roja responds to anchor anasuya crying and warns vijay devarakonda to stay in control

అసలు ఎందుకు ఏడుస్తోంది? ఏం జరిగింది అనేది మాత్రం సస్పెన్స్ ఉండటంతో అనసూయ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ వల్లనో లేక ఎవరైనా ఆంటీ అని పిలవడం వల్లనో హర్ట్ అయి ఉంటుందని అనుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అనసూయ ఏడుస్తుంటే తట్టుకోలేని ఫ్యాన్స్ ఉన్నారని తెలుస్తోంది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అవుతుండడంతో అనసూయకి మద్దతుగా నిలుస్తూ ధైర్యం ఇస్తున్నారు ఫ్యాన్స్. ఆ మధ్య అనసూయ పట్ల కొంతమంది నెటిజన్స్ అబ్యుసింగ్ వర్డ్స్ అన్నందుకు అనసూయ రిప్లై ఇస్తూ దయచేసి మీరు మీ పని చూసుకోండి.

నన్ను నా పని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగ జాతి పరువు తీస్తున్నారు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే డ్రెస్సింగ్ విషయంలో తరచూ నెటిజన్స్ నుంచి ఆమె విమర్శలు ఎదుర్కొంటున్నారు.అయితే తాజాగా అనసూయ పెట్టిన వీడియో చూసిన మంత్రి రోజా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారట. వెంటనే ఈ విషయం గురించి అనసూయకి ఫోన్ చేసి కనుక్కున్నట్టు సమాచారం. అసలు నిన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? నాకుచెప్పు వాడి సంగతి నేను చూసుకుంటా అని మంత్రిరోజా అనసూయకి ధైర్యం చెప్పినట్లు సమాచారం(Roja Anasuya Bharadwaj).

ఆమెకు ఫోన్ చేసి సపోర్ట్ గా మాట్లాడుతూ ఇంటర్నెట్ లో ఇలాంటి నెగెటివిటీ చాలా కామన్. ఇవన్నీ మనం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ ఫ్యామిలీ పిల్లలతో లైఫ్ చేయి ఎక్కువ సమయం, కుటుంబంతో గడుపు. అప్పుడు డిప్రెషన్ మొత్తం పోయి ఛిల్ల్ అవుతావని అనసూయకి ధైర్యం చెప్పినట్లు సమాచారం. ఇలా ఏడుస్తూ వున్నవీడియో పెట్టి ఒక సుదీర్ఘమైన నోట్ కూడా రాసింది. మరి ఆమెకి ఎవరు ఏమన్నారో, ఎందుకు ఆలా అంత సుదీర్ఘ నోట్ పెట్టిందో తెలియయటం లేదు కానీ, నోట్ సారాంశం మాత్రం.(Roja Anasuya Bharadwaj)

సాంఘీక మాధ్యమం అనేది అందరినీ కలిపేలా ఉంటుంది. అలాగే ఒకరి విషయాలు, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది ఒక వేదికలా ఉంటుంది అని, అలాగే వేరేవాళ్ళ జీవన విధానం, సంస్కృతి తెలియటం కోసం ఇది ఒక మంచి ప్రదేశం అని భావించాను, కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అని నేను ఆశ్చర్యపోయాను, అని రాసింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University