Cinema

Sai Dharam Tej: బాధలో సాయి ధరమ్ తేజ్.. గుండెపగిలేలా కన్నీరు పెట్టుకున్నాడు..

Sai Dharam Tej మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ వివాహ నిశ్చితార్థం ఇటీవలే జరిగి సందడి చేసిన సంగతి తెలిసిందే. వరుణ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందడి చేసిన సాయి ధరమ్ తేజ్‌కు గుండెల్లో గుబులు పుట్టింది. తన ప్రియమైన పెంపుడు జంతువు చనిపోవడంతో సాయి ధరమ్ తేజ్ గుండె పగిలిపోయింది. తన పెంపుడు కుక్క చనిపోయిందని సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఆ పెంపుడు కుక్కతో దిగిన ఫోటోను షేర్ చేశాడు.
అంతే కాకుండా తన పెంపుడు కుక్క టాంగో చనిపోవడంతో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఈ పోస్ట్‌లో సాయి ధరమ్ తేజ్. నిన్ను తలుచుకున్నప్పుడల్లా నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఇప్పుడు నువ్వు పోయావని నా మనసు తట్టుకోలేకపోతోంది. నా చీకటి రోజుల్లో కూడా నేను కష్టాల్లో ఉన్నప్పుడు, మీరు నాతో ఉన్నారు. ఆ సమయంలో నువ్వు నన్ను సంతోషపెట్టావు. మీరు ఇప్పుడు లేనందున నేను దానిని తీసుకోలేను. లవ్ యు మై ఫెలో టాంగో అంటూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశాడు తేజ్. ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా టాంగో మొదటిరోజు తీసుకున్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ లెటర్స్ రాసుకు వచ్చారు. (Sai Dharam Tej)

sai-dharam-tej-marriage

నువ్వు నన్ను రక్షించావు కష్టాల్లో నాతో ఆడుకున్నావు, నాకు సంతోషాన్ని కలిగించావు.ఇలా నాకు ఎంతో ప్రేమను కలిగించిన నిన్ను పొందడం నా అదృష్టం. నువ్వు నా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఓ మూమెంట్ లాగా గుర్తుంది.లవ్ యు మై బండ ఫెలో. ఇలా సాయిధరమ్ తేజ్ తన పెట్ డాగ్ గురించి తనపై ఉన్నటువంటి ప్రేమ గురించి తెలియజేస్తూ ఈ సందర్భంగా రాసినటువంటి ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈయన షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సైతం ఎంతో బాధను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు

sai-dharam-tej-pet-dog-death

ఇందులో తన టాంగో గురించి రాసుకోస్తూ నిన్ను తలుచుకున్న ప్రతిసారి నా మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. నువ్వు లేకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది. విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ వంద కోట్ల క్లబ్ లో చేరాడు. వచ్చే నెలలో బ్రో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు పవన్ కళ్యాణ్. సినిమా ఫస్ట్ లుక్ తో అలరించాడు. (Sai Dharam Tej)

తేజ్‌కి ఇదే మంచి తరుణం కాగా, తాను ఎంతో ఇష్టపడే పెంపుడు కుక్క టాంగో చనిపోవడం మెగా హీరో గుండెను బద్దలు కొట్టింది. ఇక పవన్ కళ్యాణ్తో కలిసి బ్రో సినిమా లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా జులై 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

Damon

Iam Praneeth Naidu, Iam passionate about writing entertainment articles on Movie News & Gossips.