CinemaTrending

Shakeela: బిగ్ బాస్ 7 లోకి షకీలా ఎంట్రీ.. ఇక ఈ సీజన్ సూపర్ హిట్టే..

Shakeela: బిగ్గెస్ట్ రియాలిటీ షో అక్కినేని నాగార్జున గారు హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 కి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 3 నుంచి షో ప్రారంభం కానుంది. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో సీజన 7 గ్రాండ్ సక్సెస్ చేయాలని టీం భావిస్తోంది. ఉల్టా పల్టా కాన్సెప్ట్‌తో ఈ సారి షో కొత్తగా ఉంటుంది అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 కి సంబంధించి ఇప్పటికే రిలీజైన ప్రోమోలో కొంత బస్ క్రియేట్ చేశాయి. సోషల్ మీడియా ప్రకారం మనం చూసుకుంటే నిజానికి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరెవరు ఎంట్రీ ఇస్తున్నారన్న దానిపై టీమ్ చివరి వరకు సీక్రెట్ గా ఉంచుతుంది.

senior-actress-shakeela-to-enter-big-boss-this-season-will-be-super-hit-nagarjuna-to-reveals-this-news-soon

అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా సీజన్ 7 బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టేది వీరే అంటూ కొందరు పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వివిధ కేటగిరీల్లో సెలెక్ట్ అయిన కంటెస్టెంట్లు వీళ్లేనంటూ లిస్ట్ లు బయటకొస్తున్నాయి.అందులో ఒకటి అనిల్ కన్ఫర్మ్. కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ లో యూట్యూబర్ అనిల్ జిల్లా పేరు అయితే గట్టిగా వినిపిస్తోంది. ఇక కార్తీక దీపం ఫేం శోభిత సిటీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కనిపించటం ఖాయమని కూడా తెలుస్తోంది. ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నకపుల్స్ లిస్ట్ లో ముఖ్యంగా ముగ్గురు జంటల పేర్లు వినిపిస్తున్నాయి(Shakeela).

అమర్దీప్ తేజస్విని ఆట సందీప్ జ్యోతి అలాగే అంజలి, పవన్ ఈ మూడింటిలో ఏదో ఒక జంట అయితే రావొచ్చు. ఇక సీజన్ 7 లో ఇప్పుడు మనకి యూట్యూబుర్ శీతల్ గౌతమ్ తో పాటు హీరో గౌతమ్ కృష్ణ పేరు కూడా వినిపిస్తోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఒక్కపటి శృంగార షకీలా రానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె హౌస్‌లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, అయితే షకీల మాత్రం ఇంకా ఓకే చెప్పలేదని సమాచారం. డేట్స్ కుదిరితే ఆమె పక్కగా హౌస్ లో కి అడుగు పెట్టె అవకాశం ఉంది. అడుగు పెట్టె అవకాశం ఉంది.(Shakeela)

రంగస్థలంలో రామ్ చరణ్ ఫ్రెండ్ గా నటించిన మహేష్ సింగర్ క్యాటగిరిలో మోహన భోగరాజు, భోలే షావలి, ట్రాన్స్‌జెండర్ క్యాటగిరిలో జబర్దస్త్ తన్మయ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈసారి బిగ్ బాస్, తెలుగు సీజన్ 7 లో ఎవరు ఎవరు అదుఫు పెట్టనున్నారో తెలియాలంటే సెప్టెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.

షకీలా ప్రముఖ దక్షిణ భారత చలన చిత్ర నటి. ఎక్కువగా మళయాళ శృంగార చిత్రాలలో నటించింది. షకీలా సూళ్లూరుపేట దగ్గర కోట లో పెరిగింది. తమిళంలో “ప్లేగర్ల్స్” అనే ‘సాఫ్ట్‌కోర్’ చిత్రంతో ఈమె సినీ ప్రస్థానం మొదలెట్టింది ఈ సినిమాలో సిల్క్ స్మిత ప్రధాన కథానాయిక కావడం విశేషం.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University