Cinema

Mahesh Babu: గుంటూరు కారం నుండి అదిరిపోయే అప్డేట్.. మహేష్ బాబు ఫాన్స్ కి పండగే..

Mahesh Babu Birthday: త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన మరియు దర్శకత్వం వహించిన, గుంటూరు కారం యాక్షన్ డ్రామా, ఇందులో మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి మరియు జాన్ అబ్రహం ప్రధాన పాత్రలలో నటించారు. జగపతి బాబు, జయరామ్, సునీల్ మరియు ప్రకాష్ రాజ్ కూడా తారాగణం. ఈ చిత్రం సంక్రాంతికి ముందు జనవరి 12, 2024న థియేటర్లలో విడుదల కానుంది. మహేష్‌బాబు అభిమానులు ఆల్రెడీ ఒక ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. గుంటూరు కారం సినిమా గురించి అప్డేట్స్ లేక షూటింగ్ అసలు జరుగుతుందో లేదో తెలియక ఫాన్స్ అంతా అయోమయంలో ఉన్నారు.

super-star-guntur-karam-movie-team-is-planning-to-release-song-on-mahesh-babu-birthday

ఇలాంటి సమయంలో సూపర్ స్టార్ బర్త్ డేని మహేష్ అభిమానులకు కొంచం సంతోషాన్ని కలిగించే వార్త మరి అప్పుడైనా మహేష్ ఫ్యాన్స్ ఖుషి అయ్యే అప్‌డేట్స్ రాబోతున్నాయి. అసలు ఈ సారి సూపర్ స్టార్ బర్త్ డేకి రాబోయే ఆ స్పెషల్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా పాటల్లో చూసి సంతోషపడుతున్నారు కానీ నిజంగా మహేష్ నుంచి మైండ్ బ్లాంక్ అయిపోయి అప్డేట్ వచ్చి చాలా కాలం అవుతోంది కదా. గుంటూరు కారం షూటింగ్ అయినా సాఫీగా సాగుతుందా అంటే పడుతూ లేస్తూ అలా అలా ముందుకు వెళుతోంది(Mahesh Babu Birthday).

Mahesh Babu

ఎలాగోలా కచ్చితంగా సంక్రాంతికి వచ్చేస్తాం అని దర్శక నిర్మాతలు చెప్తున్నారు. కానీ అప్ డేట్స్ విషయంలో ని చాలా సంతృప్తిగా ఉన్నారు అభిమానులు. ఫ్యాన్స్ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని మహేష్ బాబు బర్త్‌డే చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆ రోజు రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వాలని చూస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు కారం సినిమా నుంచి ఒక పాట విడుదల చేయాలి అనేది దర్శక నిర్మాతల ఆలోచన. మహేష్ బాబు అబ్రాడ్ నుంచి వచ్చేసరికి ఈ ట్యూన్ ఆడియన్సు లోకి వెళ్లాలని ఫిక్సయిపోయారు సంగీత దర్శకుడు తమన్.(Mahesh Babu Birthday)

Trivikram Mahesh Babu

అలాగే రాజమౌళి సినిమా గురించి కూడా ఏదైనా అప్డేట్ వస్తుందేమో అన్న ఆశలో ఉన్నారు అభిమానులు. కనీసం ఒక పూజ కార్యక్రమం లాంటిదైనా చేస్తారేమోనని. అది కాదంటే అధికారికంగా ఓ మాట ఏదైనా చెబుతారేమో అని చూస్తున్నారు. ఇక ఈసారి బర్త్ డేకి బిజినెస్ మేన్ ఫోర్కే వర్షన్ రిలీజ్ కి రెడీ అవుతోంది. గతేడాది బర్త్ డే కి పోకిరి సినిమాతో రి రిలీస్ ట్రెండును మొదలు పెట్టేసారు మహేష్.

ఇదే హీరోలంతా ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ఈసారి మహేష్ పుట్టినరోజుకు బిజినెస్ మేన్ ని తీసుకొస్తున్నారు. మొత్తానికి గుంటూరు కారం సాంగ్ రాజమౌళి అప్డేట్ బిజినెస్ మేన్ రి రిలీస్ తో మహేష్ బర్త్ డే ప్లాన్స్ గట్టిగ జరుగుతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University