Cinema

Venkatesh : హీరో వెంకటేష్ ఛీకొట్టిన స్టోరీ తో సూపర్ హిట్ కొట్టేసిన ఆ హీరో ఎవరు..

Venkatesh : టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. దగ్గుబాటి రామానాయుడు త‌న‌యుడిగా ఇండస్ట్రీకి వచ్చినా.. తనదైన ప్రతిభతో తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. నటుడిగా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. వెంకటేష్ తన సినీ కెరీర్‌లో చాలా సినిమాలను తిరస్కరించాడు. అందులో ఫ్లాప్ సినిమాలున్నాయి.. హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఓసారి వెంక‌టేష్ ఛీ కొట్టిన క‌థ‌తోనే అక్కినేని మ‌న‌ధుడు నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు.

that-star-hero-who-made-a-super-hit-with-the-story-of-hero-venkatesh-rejected

ఇంత‌కీ ఆ సినిమా మ‌రేదో కాదు `శివ‌మ‌ణి`. పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రక్షిత, అసిన్ హీరోయిన్లుగా న‌టించారు. ప్ర‌కాష్ రాజ్‌, ఆలీ, ఎం. ఎస్. నారాయణ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. చ‌క్రి స్వ‌రాలు స‌మ‌కూర్చారు. వైష్ణో అకాడమీ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం 2003లో విడుదలై ఘన విజయం సాధించింది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులతో పాటు యూత్‌ని కూడా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది(Venkatesh).

Venkatesh Nagaarjuna

ఆ సమయంలో సంతోషం, మన్మధుడు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని మంచి మూడ్ లో ఉన్న నాగార్జున శివమణితో హ్యాట్రిక్ సాధించాడు. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. శివ‌మ‌ణి మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ నాగార్జున కాదు. డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఈ సినిమా క‌థ‌ను మొద‌ట విక్ట‌రీ వెంక‌టేష్ వ‌ద్ద‌కు తీసుకెళ్లాడ‌ట‌. అయితే వెంక‌టేష్ కు ఫ‌స్ట్ న‌చ్చినా.. సెకండ్ మాత్రం మెప్పించ‌లేక‌పోయింద‌ట‌. దాంతో వెంకీ ప‌లు మార్పులు చేయాల‌ని చెప్పాడ‌ట‌. కానీ, పూరీ జ‌గ‌న్నాథ్ మాత్రం అందుకు ఒప్పుకోలేద‌ట‌.(Venkatesh)

Puri Ngarjuna

దాంతో వెంక‌టేష్ శివ‌మ‌ణి తాను చేయ‌న‌ని ముఖం మీదే చెప్పేశాడ‌ట‌. అలాగే వెంకీ నుంచి చేజారిన శివ‌మ‌ణి.. నాగార్జున వ‌ద్ద‌కు వెళ్లింది. ఆయ‌న‌కు స్టోరీ బాగా న‌చ్చ‌డంలో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. క‌ట్ చేస్తే సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. వెంకటేశ్ కథానాయకుడిగా ‘సైంధవ్’ సినిమా రూపొందుతోంది. శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమాను వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నాడు.

ఇది ఎమోషన్స్ తో కూడిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్. పోస్టర్స్ తోనే ఈ సినిమా అందరిలో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఇక వెంకటేశ్ యాక్షన్ స్టిల్స్ కూడా ఆసక్తిని రేకెత్తించాయి. ఆయన చేతిలోని వెపన్స్ చూస్తే, ఆయనను దాటి విలన్ గ్యాంగ్ వెళ్లలేదనే విషయం అర్థమవుతోంది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University