Cinema

VenuSwamy – Niharika : నిహారిక జాతకం ముందే చెప్పేసిన వేణు స్వామి..?

VenuSwamy – Niharika ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసే కామెంట్లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతాయి. ఈయన ఎక్కువగా సెలబ్రెటీల, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు. నిజానికి ఆయన చెప్పినవి చెప్పినట్లే జరగటంతో కొందరు జనాలు నమ్ముతూ ఉంటారు. సమంత, నాగచైతన్య విడిపోతారని గతంలో ఈయన వ్యాఖ్యలు చేయటంతో అవే నిజమయ్యాయి. అంతేకాకుండా మరికొంతమంది సెలబ్రెటీల జాతకాలు కూడా నిజమయ్యాయి. దీంతో అప్పటినుంచి ఈయన ఎవరి జాతకాలు చెప్పిన ఇట్టే అవుతుంది మరియు వైరల్ అవుతూ ఉన్నాయి.

వేణు స్వామి జాతకాలు చెప్పడమే కాకుండా పరిహారం కూడా ఇస్తాడు. ఇప్పటికే రష్మిక మందన్న నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు చేసి ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే తాజాగా మెగా డాటర్ నిహారిక జాతకం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా నిహారిక తన భర్తతో విడాకులు తీసుకున్న విషయాన్ని ధృవీకరించిన సంగతి అందరికీ తెలిసిందే. నిహారిక తన భర్తకు దూరం కానుందని గతేడాది నుంచి జోరుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు.(VenuSwamy – Niharika)

వీరి పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ కావడంతో అందరికి అనుమానం మొదలైంది. ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్న ఈ జంట తాజాగా విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. దీంతో నిహారికపై ఓ రేంజ్ లో దుమ్మెత్తి పోస్తున్నారు జనాలు. పెళ్లంటే చాలు గొడవలు వస్తాయి. అంత మాత్రాన విడాకులు తీసుకుంటారా.అసలు మీ మెగా ఆడపడుచులకు పెళ్లిళ్లు చేయడమే దండగ. అనవసరంగా పెళ్లి చేసుకున్న వ్యక్తుల జీవితాలను మోసం చేయడం తప్ప ఏం లాభం లేదు అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా కామెంట్లు చేస్తూ మెగా డాటర్ పై బాగా ఫైర్ అయ్యారు.(VenuSwamy – Niharika)

మరికొంతమంది తన మాజీ భర్త చైతన్యకు సోషల్ మీడియా వేదికగా తనను వదిలేసి మంచి పని చేసావ్ అని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి నిహారిక ఎంతలా రెచ్చిపోతుందో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.ఎవరైనా సరే భార్య అలా ఉండాలని కోరుకొరు. అయితే విషయానికి వస్తే నిహారిక పిల్లలు కూడా పుట్టరని వేణు స్వామి ముందే చెప్పినట్టు ఇప్పుడు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

నిజంగా వేణు స్వామి ముందుగానే నిహారిక గురించి ఇంత కరెక్టుగా చెప్పి ఉంటే.. అది యూట్యూబ్ లో వీడియో కనిపిస్తుంది కదా, కానీ యూట్యూబ్ వీడియో లేకుండా.. ఈరోజు నిహారిక వదిలేసిన తర్వాత.. దాని మీద ఇంత హైలెట్ చేస్తున్నారు అంటే కేవలం ఇది రూమర్ మాత్రమే. దీని వలన ఒకరి బాధ ఇంకొకరికి ఆనందం, ఒకరి సమాధి ఇంకొకరికి పునాది అనే లాంటి సామెతలు కనిపిస్తున్నాయి తప్ప ఇందులో నిజం అనేది ఎక్కడ కూడా కనిపించడం లేదు అని నెటిజనులు అనుకుంటున్నారు.

Damon

Iam Praneeth Naidu, Iam passionate about writing entertainment articles on Movie News & Gossips.