CinemaTrending

Lavanya: ఇక నా వల్ల కాదు సినిమాలకు సెలవు.. లావణ్య సంచలన కామెంట్స్ వైరల్..

Lavanya Tripathi Comments: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్నారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ సహా ప్రీ వెడ్డింగ్ హడావిడి అంతా చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక ఇటలీలోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వరుణ్, లావణ్యల వివాహం జరగనుంది. పెళ్లి ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో వర్క్ కి బ్రేక్ ఇచ్చేసాడు వరుణ్. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది.

actress-lavanya-tripathi-sesational-comments-her-acting-in-movies-after-marriage-with-varun-tej

దీంతో వరుణ్ తేజ్ లాంగ్ బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. ఇక పెళ్లి హనీమూన్ ట్రిప్ అంతా ముగిసిన తర్వాత తిరిగినా సినిమాల విషయం ఆలోచిస్తున్నాడట. ఇక పెళ్లి తర్వాత యూరప్ లోని హనీమూన్ ట్రిప్ కూడా ప్లాన్ చేసింది ఈ జంట. వీరిద్దరు నవంబర్ చివరి నాటికి తిరిగి ఇండియా వస్తారని టాక్. వచ్చిన తర్వాత డిసెంబర్ 8 న ఆపరేషన్ వాలెంటైన్ విడుదల కాబోతుంది. దీంతో ఆ ప్రమోషన్స్లో వరుణ్ మళ్లీ బిజీ అవుతాడు. ఇక ఆ తర్వాత కొంతకాలం క్రితం ప్రారంభించిన తన తదుపరి చిత్రం మట్కా షూటింగ్ అప్పుడే మొదలయ్యే అవకాశం ఉంది(Lavanya Tripathi Comments).

నిజానికి అక్టోబర్, నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. కానీ వరుణ్ తేజ్ పెళ్లి కారణంగా అవి వాయిదా పడ్డాయి. ఇక పెళ్లి హనీమూన్ అంతా పూర్తి అయ్యే ఆపరేషన్ వాలెంటైన్ విడుదలైన తర్వాత వరుణ్ మట్కా షూటింగ్ ను ప్రారంభించనున్నాడు. లావణ్యతో తన లవ్ మేటర్ గురించి పలు సందర్భాల్లో వారు మాట్లాడారు. లావణ్య పేరును మీ మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నారని వరుణ్ తేజ్ ని ఓ షోలో ఆడియన్స్ అడిగారు. దీనికి లవ్ అని సేవ్ చేసుకున్నానని చెప్పాడు.(Lavanya Tripathi Comments)

రిలేషన్షిప్ మొదలైన తర్వాత అలా ఫీడ్ చేసుకున్నారా? లేదంటే బిగినింగ్‌లోనేనా అని అడిగితే. దీనికి తనే మార్చింది ఫోన్లు అని వరుణ్ స్పందించారు. ఇక లావణ్యకి మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి అని అడిగితే సరిగ్గా గుర్తులేదు నాకు అంతే చాలా సంవత్సరాలైంది కదా అంటూ అసలు మేటర్ చెప్పాడు వరుణ్. నిజానికి చాలా సంవత్సరాల నుంచి వీళ్ల లవ్ ట్రాక్ ఉన్నా బయటకు చెప్పకుండా సీక్రెట్‌గా ఉన్నారు. వీళ్లకి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నా తర్వాత ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.

రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ఈరోజు ఎయిర్‌పోర్ట్‌లో బంధించబడ్డారు, ఇది కుటుంబం ఇటలీకి వెళ్లడంపై ఊహాగానాలకు దారితీసింది, అక్కడ నటులు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. కుటుంబ సమేతంగా విమానాశ్రయానికి చేరుకున్న ఉపాసన, వారి పసిపాప కూతురు క్లిన్ కారా కొణిదెలని ఊయలలో ఉంచుకుని ఉన్న కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను మేము గోప్యంగా చూసాము.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University