CinemaTrending

Gayathri Gupta: హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు లేక దీన స్థితిలో సాయి పల్లవి ఫ్రెండ్.. ఆదుకున్న అఖిల్..

Gayathri Gupta Health: సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ రంగుల ప్రపంచంలో అందరి జీవితాల్లో వెలుగులు కనిపించవు. సెలబ్రిటీ ల లైఫ్ అంటేనే చాల లగ్జరీ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అది అందరి జీవితాల్లో ఉండదు. వెండి తెరపై ఎంతో సంతోషంగా కనిపించే చాలా మంది నటీనటులు జీవితాల్లో ఎన్నో కన్నీళ్లు ఉంటాయి. ఐస్ క్రీమ్2, సాయి పల్లవి నటించిన ఫిదా, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోనీ, కొబ్బరిమట్ట ఇలా అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి గుప్తా జీవితంలో ఎన్నో కన్నీళ్లున్నాయి.

akhil-helped-sai-pallavis-friend-gayathri-gupta-for-health-in-poor-condition-without-money-for-hospital-expenses

ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే గాయిత్రి. చాలా కాలంగాఓ వ్యాధితో బాధపడుతోంది. ఆర్థరైటిస్ జబ్బుతో పోరాడుతున్నట్లు ఆమె గతంలో చెప్పింది. ఇది డిప్రెషన్ వల్ల వచ్చేసరికి వ్యాధిని ఆమె చెప్పుకొచ్చింది. అందుకు ట్రీట్‌మెంట్ తీసుకుంటే నయమవుతుందని, అందుకు సరిపడా డబ్బులు తనవద్ద లేవని గాయత్రి బాధ పడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆమె వైద్యానికి ₹12లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఈ మేరకు ఎవరైనా దాతలు విరాళాలు అందిస్తారేమోనని గాయత్రి ఎదురు చూస్తోంది(Gayathri Gupta Health).

ఇంపాక్ట్‌గురు అనే స్వచ్ఛంద సంస్థ ఈ విరాళాల సేకరణ కి ముందుకి వచ్చింది. ఆమె వైద్యానికి ₹12లక్షల రూపాయలు ఖర్చవుతుండగా ఇప్పటి వరకు ఆమెకి కేవలం ఒక లక్ష యాభై వేళా రూపాయలు మాత్రమే వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమెకి ఇంకా సుమారుగా ₹10లాకాశాలకు పైగా డబ్బు కావాల్సి వస్తుంది. ఈ మేరకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ తన వంతుగా సాయం చేసినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా త్వరగా కోలుకుంటామని ఆమెకు భరోసా కల్పించాడు. అంతేకాదు గాయత్రికి దాతలు సాయం చేయాలని కోరాడు.(Gayathri Gupta Health)

ఫిదా సినిమాలో సాయిపల్లవి ఫ్రెండ్ గా కనిపించిన గాయత్రి. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ప్రముఖులు సాయం చేస్తారేమో చూడాల్సి ఉంది. నా ఆరోగ్య పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. దీంతో తక్షణమే ను ట్రీట్ మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది నా జీవితంలో చాలా సంక్లిష్టమైన సమయంలో నా వైద్యానికి అవసరమయ్యే డబ్బు అవసరం లేదు. దయచేసి నాకు సాయం చేయండి. ఇంపాక్ట్ గురు డాట్ కామ్ అనే ఫండింగ్డ్ సంస్థ ధ్వారా నాకు సాయం చేయండి. మీకు తోచినంత మొత్తాన్ని వైద్య ఖర్చులకు ఇస్తారని ఆశిస్తున్నాను.

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్తో పాటు బిగ్ బాస్ టీంపై లైంగిక ఆరోపణలతో గాయత్రి గుప్తా తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ మూడో సీజన్ కి పోటీ దారుగా పాల్గొనడానికి ఆసక్తి ఉందా అని ముగ్గురు సభ్యులు తనను సంప్రదించారని, ఒకవేళ బిగ్‌బాస్ ఎంపికైతే తమను ఎలా సంతృప్తి పరుస్తా వారి టీం సభ్యులు అడిగినట్లు గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University