Cinema

Ram Charan : రామ్ చరణ్ ఉపాసనల కూతురి కోసం అంబానీ అద్భుతమైన గిఫ్ట్.. 

Ram Charan Ambani : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పెళ్లి అయిన 11 ఏళ్ల‌కు తండ్రిగా ప్ర‌మోష‌న్ పొందిన సంగ‌తి తెలిసిందే. ఈయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న గ‌త ఏడాది ప్రెగ్నెంట్ అయిన విష‌యాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా వెల్ల‌డించారు. అలాగే ఉపాస‌న‌ను ఎంతో అపురూంగా చూసుకున్నారు. జూన్ 20వ తేదీన హైద‌రాబాద్ లోని అపోలో హాస్ప‌ట‌ల్ లో ఉపాస‌న ఆడబిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాక‌తో రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల‌తో పాటు కుటుంబ స‌భ్యుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

ram-charan-ambani

పాప పుట్టిన మూడోరోజైన జూన్ 23న ఉపాస ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. నిన్న రామ్ చరణ్-ఉపాసన దంపతులు తమ బిడ్డతో ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. అయితే ఆ చిన్నారి ముఖం ఎవరికీ కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఇంటికి వెళ్లే ముందు రామ్ చరణ్ మీడియాతో మాట్లాడారు. ఇక ఈ నేపథ్యంలోనే మెగా ప్రిన్సెస్ ను ఎప్పుడు చూస్తామా ? తనకి ఏ పేరు పెడుతున్నారు? పాప ఎవరి పోలిక ఉంది ?అంటూ ఇలా రకరకాలుగా అభిమానులు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు(Ram Charan Ambani).

Upasana-Ram-Charan

ఇకపోతే ఆల్రెడీ ఒక పేరు అనుకుంటున్నట్లు మొన్న ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఆ పేరు నే పాప బారసాల రోజు తానే అందరికీ తెలియజేస్తాను అని కూడా రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ఇక ఈరోజు ఆ తరుణం రానే వచ్చింది. ఈరోజు మెగా యువరాణి బారసాల వేడుక జరగనున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ ఎక్కడ జరగబోతోంది? ఎవరు వస్తున్నారు? అని సస్పెన్స్‌లో ఉంచారు. కాగా, ఈ బారసాల వేడుకకు భారతీయ కుబేరుడిగా గుర్తింపు పొందిన ముఖేష్ అంబానీ దంపతులు రానున్నారు(Ram Charan Ambani).

Ram charan

అంతేకాదు పాప కోసం బంగారు ఊయలని బహుమతిగా ఇవ్వబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారింది. తన మనవరాలు శుభ ముహూర్తాల్లో పుట్టిందని, జాతకం కూడా అద్భుతంగా ఉందని చిరంజీవి అందరికీ తెలియజేస్తున్నారు. అంతే కాదు.. కడుపులో ఉన్నట్లే తమ ఇంట్లోనూ పాప జాతకం సంతోషకర వాతావరణాన్ని తీసుకొచ్చిందని ఆయన వెల్లడించడం గమనార్హం.

ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చంగెర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కొన్ని అని వార్యాల కారణాల వాళ్ళ షోట్టింగ్ కొన్ని రోజులు ఆగిపోయిందనే సమాచారం వినపడుతుంది. సంతోషకర వాతావరణాన్ని తీసుకొచ్చిందని ఆయన వెల్లడించడం గమనార్హం.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University