Trending

Anasuya Comments : వాడు హీరో ఏంటి.. అల్లు అర్జున్ మొహం కూడా చూడలేకపోయా..

Anasuya Comments జబర్దస్త్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది. సెలబ్రిటీ హోదా కూడా ఇచ్చింది. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ ఒకరు. అప్పటి వరకు అపరిచితురాలుగా ఉన్న అనసూయ జబర్దస్త్ యాంకర్‌గా కనిపించిన తర్వాత అందరిలో బానే పాపులారిటీ ని సంపాదించింది. చాలా ఏళ్లుగా జబర్దస్త్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టకుండా వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అదృష్టవశాత్తూ, ఆమెకు మంచి పాత్రలు వచ్చాయి.

ll

అనసూయ చాలా తక్కువ సమయంలో పరిశ్రమలో చాలా ఫేమస్ ఐపోయింది. ముఖ్యంగా రంగస్థలంపై రంగమ్మత్త పాత్రలో నటించింది. ఈ పాత్ర అనసూయ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రంలో పుష్ప నెగటివ్ షేడ్స్ ఉన్న దాక్షాయిణి పాత్రలో నటించింది. ఈ పాత్ర కూడా బాగా క్లిక్ అవ్వడంతో అనసూయకు మరింత గుర్తింపు వచ్చింది. మొన్న విమానం సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాలో అనసూయ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తుంది.(Anasuya Comments)

allu-arjun-anasuya

ఇదిలా ఉంటే గతంలో అల్లు అర్జున్‌పై అనసూయ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ హీరో ఏమిటి? గంగోత్రి సినిమా చూశాక మెగా ఫ్యామిలీలో హీరో అవుతాడేమో అనుకున్నాను అల్లు అర్జున్ గురించి. లంగా వోణిలో అల్లు అర్జున్‌ని చూసి అబ్బో చిరాకు వచ్చిందని అనసూయ తెలిపింది. సినిమాల్లో చూసి అల్లు అర్జున్ తన ఫేవరేట్ హీరో అయ్యాడని అనసూయ తెలిపింది. ఏది ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై నెటిజన్లు వైరల్ కామెంట్స్ చేస్తున్నారు అని చెప్పాలి.(Anasuya Comments)

anasuya-allu-arjun

అల్లు అర్జున్ పై అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. ఆ వీడియోలో అనసూయ మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీ అయితే హీరో అయిపోతారా? గంగోత్రి మూవీ చూసి అసలు మనవాళ్లకి ఏమైంది అనుకున్నా.. బీ ఫ్రాంక్.. మీరందరూ అదే అనుకోని ఉంటారు. అల్లు అర్జున్‌ లంగా ఓణీ వేసి చేసిన పాట అయితే అబ్బో..!

అంటూ రియాక్ట్ అయింది అనసూయ. నిజానికి ఇది చాలా ఓల్డ్ వీడియో. ఆ తర్వాత దీనిపై వివరణ కూడా ఇచ్చింది అనసూయ. అల్లు అర్జున్ అంటే తనకు పిచ్చి అని, ఆయన డాన్స్ మూమెంట్స్ తనకు చాలా ఇష్టమని కూడా చెప్పింది. కాకపోతే సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఈ వీడియోతో దుమారం మొదలైంది.

Damon

Iam Praneeth Naidu, Iam passionate about writing entertainment articles on Movie News & Gossips.