CinemaNews

NTR : సీనియర్ ఎన్టీఆర్ కుమారుడికి కార్ యాక్సిడెంట్..

నందమూరి కుటుంబానికి చెందిన మరో వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఎన్టీఆర్ తనయుడు, బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ ప్రయాణిస్తున్న కారు ఈరోజు ప్రమాదానికి గురైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ తృటిలో తప్పించుకున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లో శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ntr-son

కారు ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అతని కుటుంబ సభ్యులు వచ్చి కారును తీసుకెళ్లారు. అలాగే, ప్రమాదానికి సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకోవడంతో నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ntr-son-car-accident

తాజాగా నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. నారా లోకేష్ పాదయాత్రలో కుప్పకూలిన ఆయన ప్రస్తుతం బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తారకరత్న క్రమంగా కోలుకుంటున్నాడు. ఇదిలా ఉంటే నందమూరి కుటుంబ సభ్యులు వరుస రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో నందమూరి హరికృష్ణ, నందమూరి జానకిరామ్‌లు కారు ప్రమాదంలో మరణించారు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా కాలం క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నందమూరి రామకృష్ణ ఇటీవల బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్నను పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Priya Reddy

#Foodie #MovieLover Iam Priya from hyderabad, I love writing content Especially on Movies. Love eating Mirchi bajji While Its Raining