Cinema

Balakrishna : రికార్డులు బద్దలు కొడ్తున్న బాల్లయ్య.. అస్సలు ఆగట్లేదు గా..

Balakrishna New Record : చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత తండ్రి మాటకు తగ్గట్టుగానే కొడుకుగా దూసుకుపోతున్నాడు. నందమూరి ఫ్యామిలీ హీరోగా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న ఆయనకు రాయలసీమలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య సినిమాలు డిజాస్టర్స్‌గా మారినప్పటికీ రాయలసీమలో మాత్రం కలెక్షన్లు అదరగొడుతున్నాయి. ఆయన శృతి హస్సన్ తో కలిసి నటించిన వీరసింహారెడ్డి చిత్రం ఇటీవలే 175 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలయ్య నటించిన అఖండ సినిమా కూడా చాలా రోజులు థియేటర్లలో ప్రదర్శితమైంది.

balakrishna-is-breaking-new-record-seems-not-to-stop-at-all

హీరో బాలకృష్ణ ,డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా బాలయ్య మాస్ హీరోగా డబల్ యాక్షన్ తో అదరగొట్టేసారని చెప్పవచ్చు. బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన చిత్రం ఇప్పుడు ఒక రికార్డును సైతం క్రియేట్ చేసింది. ఒకప్పుడు స్టార్ హీరోల చిత్రాలు 100 రోజులు 150 రోజులు 175 రోజులు 200 రోజులు వంటివి పలు రికార్డులు సృష్టిస్తూ ఉండేవి.. కానీ ఈ మధ్యకాలంలో కేవలం సినిమా వచ్చిన నెలలోపే ఓటీటి లో రావడం వల్ల కలెక్షన్లు రాబట్ట లేకపోతున్నాయి. నెలలోపే ఓటీటి లోకి చిత్రాలు వచ్చేస్తున్నాయి(Balakrishna New Record).

Veerasimhareddy 175 days

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ బాలయ్య సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకోవడంతో బాలయ్య ఖాతాలో అరుదైన రికార్డులు వచ్చి చేరుతున్నాయి. కర్నూలు జిల్లాలోని ఆలూరు లో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ థియేటర్ లో వీరసింహారెడ్డి సినిమా ఏకంగా 175 రోజులపాటు ప్రదర్శించబడింది. ముఖ్యంగా ఇన్ని రోజుల వరకు ఈ సినిమా భారీ ఆక్యుపెన్సీ తోనే ప్రదర్శితం అవడం గమనార్హం . అంతేకాదు సి సెంటర్లో బాలయ్య బాబు నటించిన ఈ సినిమా ఇలా అరుదైన ఘనత దక్కించుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.(Balakrishna New Record)

Akhanda 175 days

అంతేకాదు ఆయన తదుపరి చిత్రాలు కూడా ఇదే రీతిలో రికార్డులను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో బాలయ్య హ్యాట్రిక్ విజయాలు అందుకోలేదనే చెప్పాలి. ఆయన కాజల్ తో కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి హిట్ అయితే తప్పకుండా హ్యాట్రిక్ సక్సెస్ అందుకోవడం ఖాయం. సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో బాలయ్య ఈసారి హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తానికి సిల్వర్ జూబ్లీ రికార్డ్ పరంగా సీనియర్ స్టార్ హీరోలలో బాలయ్య.

ఇలా చెప్పుకుంటూ పోతే రెండు సిల్వర్ జూబ్లీ సినిమాలు అది కూడా రియల్ రోజులు చేసిన సినిమాలు 175 రోజులు ఆడడం కేవలం ఒక బాలయ్య వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. మరి ఇదే ఉత్సాహంతో బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి చిత్రం కూడా ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావు పూడి తెరకెక్కిస్తున్నారు ఇందులో కూడా బాలయ్య ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University