News

ఆ పదం అర్జెంటుగా తొలగించాలి.. లేదంటే చర్యలే…

“ఇండియన్ వేరియంట్” అనే పదంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ పదాన్ని ఉపయోగిస్తూ… సోషల్ మీడియాలో చాలా మంది దేశ పరువు తీస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార టెక్నాలజీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌లోని డబుల్ మ్యూటెంట్ అయిన B.1.617ను చాలా మంది సోషల్ మీడియాలో… ఇండియన్ వేరియంట్ అని చెబుతున్నారు. ఐతే… ఇది ఇండియన్ వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎక్కడా చెప్పలేదు. దీన్ని వేరియబుల్ ఆఫ్ కన్సర్న్ అని మాత్రమే చెప్పింది.

అంటే… ఈ వైరస్ వేర్వేరు దేశాల్లో విస్తరిస్తోందని అర్థం. అంతే తప్ప… దీనికీ, ఇండియాకీ సంబంధం ఉంది అని WHO చెప్పలేదు. చాలా మంది సోషల్ మీడియాలో… దీన్ని ఇండియన్ వేరియంట్ అని అసత్య ప్రచారం చేస్తున్నారు. దీనిపైనే కేంద్ర సమాచార శాఖ ఫైర్ అవుతోంది. ఎవరైనా సరే… ఈ పదాన్ని ఇండియాకి లింక్ పెట్టి వాడి ఉంటే… తొలగించాల్సిందిగా నోటీస్ జారీ చేసింది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే తామూ ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపింది. సో… నెటిజన్లు ఎవరైనా ఎక్కడైనా సోషల్ మీడియా సైట్లలో… B.1.617ను ఇండియన్ వేరియంట్ అని చెప్పి ఉంటే… వెంటనే ఆ వాక్యాన్ని తొలగించాల్సి ఉంటుంది. లేదంటే… చట్టపరమైన చర్యలు తప్పవు అని కేంద్రం తెలిపింది.

ఇండియాలో పుట్టిన B.1.617… ప్రపంచ దేశాలకు పాకుతోందని అసత్య ప్రచారం చేస్తున్నారనీ… ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని కేంద్ర సమాచార శాఖ తెలిపింది. WHO అలా చెప్పనప్పుడు… సోషల్ మీడియాలో నెటిజన్లు అలా ఎందుకు తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని కేంద్రం ప్రశ్నిస్తోంది. దీనిపై మే 12నే స్పష్టత ఇచ్చామనీ… ఇందుకు సంబంధించిన ప్రెస్ రిలీజ్‌ని ఈ లింక్ ద్వారా చూడవచ్చని కేంద్రం లింక్ ఇచ్చింది. అది ఇదే.  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1717876

సో… నెటిజన్లు ఇప్పుడే ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని వెతికి… దాన్ని అర్జెంటుగా తొలగించాల్సి ఉంది. ఎప్పుడు రాశామో, ఎక్కడ రాశామో గుర్తు లేదు అంటే కుదరదు. కేంద్రం గనక అలాంటి పదాన్ని ఎవరైనా రాసినట్లు గుర్తిస్తే… వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. కేసు నమోదు చేస్తుంది. ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి… చర్యలు కఠినంగానే ఉంటాయి. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే… ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఏదైనా రాసేటప్పుడు కచ్చితమైన అధికారిక ఆధారాలు ఉంటేనే రాయాలి తప్ప  తాము అనుకునేది, ఇతరులు ఊహించేది రాస్తే  ఆ తర్వాత ఇదిగో ఇలాంటి చర్యలు తీసుకునే ప్రమాదం ఉంటుంది.

Nithin Varma

Myself Nithin Varma, I love writing articles on Movies & Technology. Writing articles since 2014

Leave a Reply