Cinema

Arvind Swamy : నటుడు అరవింద్ స్వామి ఆస్థి విలువ ఎన్ని వేల కొట్లో తెలుసా..?

Arvind Swamy : టాలీవుడ్ లో గతంలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు నటుడు అరవిందస్వామి.. ముఖ్యంగా రోజా, బొంబాయి, దళపతి తదితర సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. వరుసగా సినిమాల తీస్తూ అమ్మాయిల కలల రాకుమారుడు గా పేరు సంపాదించారు. అయితే ఆ తరువాత 2000 సంవత్సరంలో సడన్గా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. అప్పటినుంచి ఎక్కువగా బిజినెస్ పైన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో తనకు జరిగిన ఒక రోడ్డు యాక్సిడెంట్ నుంచి కోలుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందట.

do-you-know-how-many-thousand-crores-worth-of-actor-arvind-swamy-property

చెన్నైలో జ‌న్మించిన అర‌వింద్ స్వామి.. ఆమెరికాలో మాస్టర్స్ కంప్లీట్ చేశాడు. పాకెట్ మనీ కోసం చిన్న‌త‌నంలో ప‌లు యాడ్స్ లో న‌టించాడు. డాక్ట‌ర్ కావాల‌నుకున్న అర‌వింద్ స్వామి అనుకోకుండా యాక్ట‌ర్ అయ్యాడు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. తండ్రి వ్యాపారాలు చూసుకునేవాడు. అలాగే, 2005లో “టాలెంట్ మాగ్జిమస్ ” అనే కంపెనీని స్థాపించాడు. ఈ సంస్థ మార్కెట్లో తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేస్తుంది. ఇది కన్సల్టెన్సీ సంస్థలా పనిచేస్తుంది. అరవింద్ స్వామి ఇప్పటికీ ఈ కంపెనీని నడుపుతున్నారు. అరవింద్ స్వామి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదుగుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు(Arvind Swamy).

Arvind Swamy Properties

ఆ యాక్సిడెంట్ లో అర‌వింద్ స్వామి కాలు ప‌క్ష‌వాతానికి గురైంది. నాలుగైదేళ్లు చికిత్స అనంత‌రం సంపూర్ణంగా కోలుకున్న అర‌వింద్ స్వామి.. విజ‌య‌వంత‌మైన వ్యాపార‌వేత్త‌గా కొన‌సాగుతూనే 2013లో `కాద‌ల్‌` మూవీతో గ్రాండ్‌ రీఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత `తని ఒరువన్` అనే మూవీలో స్లైలిష్‌ విల‌న్ గా అద‌ర‌గొట్టి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. రామ్ చరణ్ తో కలిసి నటించిన ధృవ పేరుతో తెలుగులో రీమేక్ చేయ‌గా.. ఇక్క‌డ కూడా అర‌వింద్ స్వామిని విల‌న్ గా మెప్పించాడు. అలాగే వచ్చే ప్రతి సినిమాకు సంతకం చేయకుండా చాలా సెలెక్టివ్ గా పాత్రలను ఎంచుకుంటూ.(Arvind Swamy)

Arvind Swamy

ప్రేక్షకులను అలరిస్తున్న అరవింద్ స్వామి ఆస్తి విలువ ఎంతో తెలుసా.. దాదాపు రూ. 4,000 కోట్లు. కేవలం టాలెంట్ మాగ్జిమస్ కంపెనీ విలువ రూ. 3,300 కోట్లు అవుతుందని అంటున్నారు. మరోవైపు అరవింద్ స్వామికి చెన్నైలో ఆసుపత్రి ఉంది. అలాగే అరవింద్ స్వామి తన తండ్రి నుంచి సంపాదించిన ఆస్తుల మొత్తం విలువ నాలుగు వేల కోట్లు ఉంటుందని పలు నివేదికలు చెబుతున్నాయి.

ఈ విషయం తెలిసి స్టార్ హీరోలు సైతం అరవింద్ స్వామి ముందు తలవంచుతున్నారని అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ లో గతంలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు నటుడు అరవిందస్వామి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University