CinemaTrending

Ravinder: నేను ఏ తప్పు చెయ్యలేదు అర్ధం చేసుకో.. నటి మహాలక్ష్మి భర్త ఎమోషనల్ వీడియ..

Producer Ravinder Chandrasekar: చీటింగ్ కేసు లో అరెస్టయిన తమిళ నిర్మాత రవీందర్ చంద్ర శేఖరన్ బెయిల్‌పై బయటికి వచ్చాడు. అయితే తనను అన్యాయంగా కేసులో ఇరికించారని వాపోయాడు మహాలక్ష్మి భర్త చంద్ర శేఖర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. నాకు మా అమ్మ తర్వాత మహాలక్ష్మి అంటేనే ఎక్కువ ఇష్టం. ఆమె నాకు దొరికిన వరం. మా ఇద్దరిని ఎవరూ విడదీయలేరు. ట్రోలర్స్ ఎన్నైనా అనుకోండి, ఎంతైనా తిట్టుకోండి. కానీ మమ్మల్ని వేరు చేయలేరు. నన్ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లినపుడు కింద కూర్చోమన్నారు.

famous-serial-actress-mahalakshmi-husband-producer-ravindar-chandrasekar-emotional-video

కానీ అందరికీ వారి శరీరం సహకరించినట్లుగా నా బాడీ నా సహకరించదు. నేను చెప్పేది కూడా వినకుండా అరెస్ట్ చేసి లాక్కెళ్లారు. నేనే ఏ తప్పు చేయలేదు. నా మీద ఫిర్యాదు చేసిన వ్యక్తి అనేక తప్పుడు పనులు చేశాడు. దొంగతనాలు చేశాడు. అవన్నీ నాకు తెలిసిపోవడంతో నా మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించాడు. నేను అతన్ని వదిలిపెట్టను. తన బండారం మొత్తం బయటపెడతాను దోషిగా నిరూపిస్తానంటూ ఏడ్చేశాడు రవీందర్. వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్ కోట్లు సంపాదించవచ్చంటూ చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తి నమ్మించాడు రవీందర్(Producer Ravinder Chandrasekar).

video

అందుకు కావాల్సిన నకిలీ పత్రాలు సిద్ధం చేసి అతని దగ్గరనుండి ₹15 కోట్లకు రూపాయలకు పైగా డబ్బు తీసుకున్నాడు. 2020 లో సెప్టెంబర్ 17 న ఈ ఒప్పందం జరిగింది. అయితే డబ్బు, డబ్బు ముట్టిన తర్వాత మహాలక్ష్మి భర్త రవీంద్ర ప్రాజెక్ట్ పక్కన పడేశాడని, కనీసం తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినప్పటికీ అందుకు సరిగా స్పందించలేదని బాలాజీ వాదన. దీంతో అతడు చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రవీంద్రను అరెస్ట్ చేశారు. రెండు, మూడు రోజుల క్రితమే అతడు బెయిల్ మీద బయటకు వచ్చాడు.(Producer Ravinder Chandrasekar)

సీరియల్ నటి మహాలక్ష్మి భర్త రవీందర్ చంద్రశేఖరన్ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో విచారకరమైన పోస్ట్‌ను ప్రచురించారు. తన సతీమణి మహాలక్ష్మితో కలిసి తరచూ ఫోటోలు పోస్ట్ చేసే రవీందర్ ఇప్పుడు ఒకే ఒక్క చిత్రాన్ని పోస్ట్ చేయడంతో అతని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బుల్లితెర నటి మహాలక్ష్మి, రవీందర్‌ల పెళ్లి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కొన్ని నెలలుగా వీరిపై చర్చ కాస్త తగ్గింది. ఈ పరిస్థితిలో రవీందర్ కంగారు పడే పోస్ట్ పెట్టారు.

సీరియల్ నటి మహాలక్ష్మి, సినీ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ఆకస్మికంగా వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ఇప్పటికే వివాహమై విడాకులు తీసుకున్నప్పటికీ, వారి వివాహం సోషల్ మీడియాను షేక్ చేసింది. వారి పెళ్లి ఫోటో ప్రచురించబడిన వెంటనే, ఈ జంట మీమ్స్‌లో ట్రెండింగ్‌గా మారింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University