Cinema

Jabardasth Comedian : పెళ్ళైన ఏడాదికే విడాకులకు సిద్ధమైన జబర్దస్త్ కమెడియన్..

Jabardasth Yadammaraju Divorce: కమెడియన్ యాదమ్మ రాజు మరియు స్టెల్లా ప్రేమించి ఇంట్లో పెద్దలను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్న సంగతి మనందరికి తెలుసు, అప్పుడు అది ఒక పెద్ద న్యూస్ అయ్యింది జబర్దస్త్ ఫ్యాన్స్కు. పటాస్ కామెడీ షోతో తన ప్రయాణం మొదలు పెట్టి పరిచయమైన యాదమ్మ రాజు పలు కామెడీ షోలలో కూడా కనిపించాడు. పోయిన ఏడాదే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లయి ఏడాది కాకముందే విడాకులు తీసుకోబోతున్నారు అని వార్తలు నెట్టింట చాలా వైరల్ అవుతున్నాయి. ఎందుకలా అని అనుకుంటున్నారా ? వివరాల్లోకి వెళితే.

yadammaraju-stella-divorce

యాదమ్మ రాజు పటాస్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకున్నాడు.. ఆ తర్వాత ఎన్నో కామెడీ షోలు చేస్తూ బుల్లితెర ప్రేక్షకుల దెగ్గర మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. దీనితో ఈ మధ్య అతనికి సినిమాల్లో కూడా నటించే అవకాశాలు వస్తున్నాయి. యాదమ్మ రాజు స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వార్తలు మరియు వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. యాదమ్మ రాజు భార్య స్టెల్లా తన భర్త పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది.

Yadamma-Raju-divorce

ఆ ఛానల్ లో షోలు, ఈవెంట్స్ చేస్తూ మంచి డబ్బు సంపాదిస్తుంది. లేటెస్ట్గా వీరిద్దరూ మాటీవీలో ఓ డ్యాన్స్ షోకి విచ్చేసారు. ఈ సమయంలో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ఈ జంట వెల్లడించింది ఆ షోలో. దీంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. అయితే అది నిజంగా కాదు, షోలో అది ఒక థీమ్ అని షోలో ఈ జంట విడిపోతున్నట్లు చెప్పారు. బుల్లితెర కామెడీ షోలో ప్రతి వారం కొత్త రకంగా కామెడీ చేస్తుంటారు ఈ జంట. ఈసారి స్టెల్లా విడాకులకు సిద్ముగా ఉన్నానని యాదమ్మ రాజుతో చెప్పింది. స్టెల్లా నేను మీతో వ్యవహరించలేను నాకు విడాకులు కావాలి అని అడిగింది (Jabardasth Yadammaraju Divorce).

అంతే కాకుండా విడాకులు కూడా గ్రాండ్ గా ఒక పెద్ద ఫంక్షన్ లా చేపదను అని అనింది స్టెల్లా. ఇదంతా ప్రమోషన్స్ స్టంట్. కానీ పబ్లిసిటీ కోసం, టీఆర్పీ కోసం ప్రతి కామెడీ షోలు, డ్యాన్స్ షోలు ఇలా చీప్ పబ్లిసిటీ స్టెంట్ చేస్తూనే ఉంటారు. ఇలా యాదమ్మ రాజు, స్టెల్లాల విడాకుల గురించి తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పుడు వీరి విడాకుల ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు తీసుకుంటున్నారా అని కొందరు తీసుకోరా అని మరికొందరు చర్చలు కూడా చేసేసుకుంటున్నారు. ఇది అణా మాట అసలు విషయం. మీరు కూడా ఈ చీప్ పబ్లిసిటీ స్టంట్ కి పడిపోయారు..

Priya Reddy

#Foodie #MovieLover Iam Priya from hyderabad, I love writing content Especially on Movies. Love eating Mirchi bajji While Its Raining