Cinema

Dhanush : ఆ స్టార్ హీరో ని బాన్ చేయబోతున్న కోలీవుడ్ ఇండస్ట్రీ.. కారణం అదే..?

Hero Dhanush Banned : తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వారసత్వం ఉన్నప్పటికీ కేవలం తన సొంత టాలెంట్ తోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. తమిళనాడు మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ నటుడు తాజాగా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటున్నారు.. రఘువరన్ బీటెక్, నవ మన్మధుడు తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ధనుష్ రీసెంట్గా సంయుక్త మీనన్ తో సార్ సినిమా మరింత పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో తన చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు.

kollywood-industry-is-going-to-ban-that-star-hero-Dhanush

ఇప్పటికే కొన్ని వందల చిత్రాల్లో నటించి తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలిన ధనుష్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలోనే ఆయన అభిమానులను ఒక పిడుగు లాంటి వార్త కలచి వేస్తోందని చెప్పవచ్చు. అదేమిటంటే కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ధనుష్ ను త్వరలో బ్యాన్ చేయబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది(Hero Dhanush Banned).

dhanush kraja

అసలు విషయంలోకి వెళితే ధనుష్ గతంలో శ్రీ తేండ్రళ్ ఫిలిం నిర్మాణంలో ఒక సినిమా చేస్తాను అని మాట ఇచ్చారట. అంతేకాదు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని సమాచారం. అయితే ఏళ్లు గడుస్తున్నా హీరో ధనుష్ ఆ సినిమాను పూర్తి చేయలేకపోయాడు. దీంతో విసిగిపోయిన నిర్మాణ సంస్థ తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించి ధనుష్‌పై నిషేధం విధించాలని కోరింది. ఆలస్యం చేసినందుకు ధనుష్‌కి రెడ్ కార్డ్ పడాలని కోలీవుడ్ ఇండస్ట్రీ భావిస్తున్నట్లు సమాచారం. పలు నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్‌లు తీసుకుని సినిమాలు చేయడానికి నిరాకరించినందుకు ధనుష్‌.(Hero Dhanush Banned)

Dhanush

కాకుండా కమెడియన్ యోగిబాబుతో పాటు ఎస్ జె సూర్య, అధర్వ, విశాల్, శింబుతో పాటు కూడా కోలీవుడ్ నిర్మాతల మండలి రెడ్ కార్డు ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఇదే గనుక జరిగితే అంత మంచి యాక్టర్స్ ను తమిళ సినీ ఇండస్ట్రీ కోల్పోయినట్లే అని చెప్పవచ్చు. పునాదులే సినిమాలు చేయడం మానేస్తే ఇక కోలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏమవుతుందో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

నిర్మాతను మోసం చేసినందుకు గాను రెడ్ కార్డు జారీ చేసే ఆలోచనలు నిర్మాత మండలి ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ధనుష్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University