Cinema

Pawan Kalyan : ఇంస్టాగ్రామ్ లో అడుగు పెట్టిన 24 గంటల లోపే 1 మిలియన్ ఫాలోయర్స్.. సునామి సృష్టిస్తున్న పవర్ స్టార్..

Pawan Kalyan Instagram Followers : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి.. ఆయన ఫాలోవర్స్ గురించి.. అభిమానుల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఏ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకపోతే పవన్ కళ్యాణ్ తన ట్విటర్ ఖాతాలో సినిమాల గురించి ఎలాంటి పోస్ట్ పెట్టడు, రాజకీయాలు, జనసేనకు సంబంధించిన పోస్టులను మాత్రమే ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తాడు. అయితే తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెడతారనే వార్త వైరల్‌గా మారింది.

power-star-pawan-kalyan-entered-instagram-had-got-one-million-followers-one-day

అయితే ఇప్పటివరకు అలా జరగలేదు.. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ ఇన్ స్టాగ్రామ్ లో తన అధికారిక ఖాతాను సృష్టించారు మరియు పవన్ కళ్యాణ్ బృందం ఈ ఖాతాను నిర్వహిస్తోంది. ట్విట్టర్ లాగే పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో జనసేన, రాజకీయాలపై పోస్ట్‌లు చేస్తారని, సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లు ఇవ్వకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలియగానే అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఫాలో అవుతున్నారు(Pawan Kalyan Instagram Followers).

Pawan Kalyan

నిమిష నిమిషానికి ఆయన ఖాతాకు ఫాలోవర్లు పెరుగుతున్నారనే చెప్పాలి. తన ట్విట్టర్ ఖాతాలో ఉన్న విషయాన్ని ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశారు. ఎలుగేతు ఎదురించు ఎన్నుకో జైహింద్.. అంటూ తన ఖాతాలో షేర్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఒక్క పోస్ట్ కూడా వేయకుండా ఒక్క రోజులో ఎంత మంది ఫాలోవర్స్ వస్తారో అని ఆయన అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫస్ట్ పోస్ట్ ఎలా ఉంటుందా అని కూడా వెయిట్ చేస్తున్నారు మరి దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో తెలుస్తుంది.(Pawan Kalyan Instagram Followers)

Power Star

దాదాపు సినీ తార‌లంద‌రూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మెయింటైన్ చేస్తున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లేదు. అయితే తాజాగా ఆయ‌న ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టారు. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లో తన అధికారిక అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నారు. `ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో..జై హింద్‌!` అని తన అకౌంట్ బ‌యోలో పెట్టుకున్నారు.ఈ ఖాతాను పవన్ కళ్యాణ్ టీమ్ నిర్వహిస్తోంది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఒక్క పోస్ట్ కూడా లేదు.

కానీ, అనుచరులు మాత్రం కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. అభిమానులే కాకుండా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ఆయన్ను ఫాలో అవుతున్నారు. నిమిషానికి ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఆరు లక్షల మందికి పైగా ఫాలోవర్లు వచ్చారు. ఫాలోవర్స్ పరంగా పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయం.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University