Cinema

Prabhas: ప్రాజెక్ట్ కే గ్లింప్స్ అదిరిపోయింది.. కానీ ఆ విషయంలో మాత్రం వెనుక బడిపోయింది..?

Prabhas Kalki Glimps: హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్అశ్విన్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె. జులై 20న అమెరికాలో జరిగిన కామిక్ కాన్ సెలబ్రేషన్స్‌లో ఈ సినిమా టైటిల్‌ని కల్కి అనే టైటిల్‌ను రివీల్ చేశారు. అందుకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, దిశా పటాని మరియు కమల హాసన్ కూడా నటించారు. దీంతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. ప్రభాస్ ప్రాజెక్ట్ కే గ్లింప్స్ అదిరిపోయింది. అందులో ఎలాంటి అనుమానంలేదు. ఆదిపురుష్ కంటే బెటర్ గా ఉంది అనే టాక్ కూడా వచ్చింది.

prabhas-kalki-glimps-is-super-but-the-view-are-less-is-that-the-reason

అంతా బానే ఉన్నా ఒక్క విషయంలో మాత్రం ప్రాజెక్ట్ కే గ్లింప్స్ చాల అంటే చాలా వెనుక పడిపోయింది. దానికి కారణం ఏంటో కూడా ప్రభాస్ అభిమానులకి అంతుచిక్కట్లేదు.? రీజన్ ఏంటబ్బా అంటూ ఆరా తీస్తున్నారు.ఇంతకీ ఏంటా విషయం ప్రాజెక్ట్ కే ఎందులో వెనకబడింది.ఈ మధ్య కాలంలో ప్రభాస్ నుండి వచ్చిన బెస్ట్ టీజర్ ఏదైనా ఉంది అంటే అది మరో అనుమానం లేకుండా ప్రాజెక్ట్ కే అంటున్నారు. ఫ్యాన్స్ సాలార్ టీజర్ గూస్‌బమ్స్ తెప్పిచ్చిన అందులో ప్రభాస్ కటౌట్ కనిపించలేదు.

Prabhas

పెళ్లికూతురుని దాచేసినట్లు దాచేసారు ప్రశాంత్ నీల్, కానీ ప్రాజెక్ట్ కె లో మాత్రం ప్రభాస్ లుక్ తో పాటు స్టోరీ లో చాలా హింట్స్ ఇచ్చారు నాగ్ అశ్విన్ ఇంత చేసినా వ్యూస్ విషయంలో గ్లింప్స్ వెనుకబడింది. ప్రభాస్ సినిమా టీజర్ ట్రైలర్ వచ్చిన ప్రతిసారి రికార్డుల కొసాలు కదిలిపోతాయ్. రెండు వారాల కిందటరిలీజ్ అయినా సాలార్ టీజర్ కూడా ఇదే చేసింది. మునుపెన్నడు ఇండియన్ సినిమా చూడని రికార్డులకు తెరతీసింది. 24గంటల్లో ఏకంగా 83మిలియన్ వ్యూస్‌తో ఆల్ టైమ్ రికార్డ్ చేసింది టీజర్(Prabhas Kalki Glimps).

Kalki

ఇప్పుడు వొచ్చిన ప్రాజెక్ట్ కే గ్లింప్స్ కి 24గంటల్లో కేవలం 12మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఈ గ్లింప్స్ అర్ధరాత్రి విడుదలవడం ప్రాజెక్ట్ కి మైనస్ అయినట్లుగా కనిపిస్తోంది. ఇండియా టైమ్ ప్రకారం జూలై21, తెల్లవారుజామున ఒంటిగంటకు విడుదలైంది. ఈ గ్లింప్స్ కానీ సాలార్ టీజర్ మాత్రం ఉదయం 5:12రిలీజ్ అయ్యింది. దాంతో సూర్యుడు రాకముందే ప్రభాస్ ఫ్యాన్స్ యూట్యూబ్ ముందు తిష్ట వేసుకుని కూర్చున్నారు. అలానే ఆదిపురుష్ టీజర్‌కు 24గంటల్లో 68.96మిలియన్ వ్యూస్ వచ్చాయి.(Prabhas Kalki Glimps)

ఈ లిస్ట్ లోకి కెజిఫ్2 టీజర్ 68.86మిలియన్ వ్యూస్ తో మూడు స్థానాల్లో 43మిలియన్ వ్యూస్‌తో రాధేశ్యామ్ నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కేవలం తెలుగు సినిమాల పరంగా చూసుకున్నా రాధేశ్యామ్ 43మిలియన్లతో రెండో స్థానంలో ఉండగా సర్కారు వారి పాట 23మిలియన్స్ లతో మూడో స్థానంలో 22.5మిలియన్ వ్యూస్‌తో పుష్పా 2 నాలుగో స్థానంలో 20.5మిలియన్ తో బ్రో ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఇందులో ప్రాజెక్ట్ కేకి స్థానం దక్కలేదు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University