Cinema

Rajeev Kanakala: ఎందుకు ఇలా చేస్తున్నారు.. భార్యతో విడాకుల వార్తల పై రాజీవ్ కనకాల ఎమోషనల్ కామెంట్స్..

Rajeev Kanakala: యాంకర్ సుమ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెను ఓ యాంకర్ గా కాకుండా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తుంటారు ప్రేక్షకులు. ఏ సినిమా ఫంక్షన్ జరిగినా సుమ యాంకరింగ్ చేయకపోతే ఆ ఈవెంట్ కి అందం రాదు. గత కొంత కాలంగా తనపై తన కుటుంబంపై వస్తున్న రూమర్స్ విషయంలో స్పందించారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల ముఖ్యంగా రాజీవ్వి, సుమ విడాకుల విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు. టాలీవుడ్ లో అంతగా స్టార్డంతో దూసుకుపోతోంది యాంకర్ సుమ.

rajeev-kanakala-emotional-comments-on-the-news-of-his-divorce-with-his-wife

స్టార్ హీరోల ఈవెంట్లకు హోస్టింగ్ చేస్తూ స్టార్లను మించిన స్టార్ గా మారిపోయింది.సుమా కనకాల. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లాడింది. సుమ రాజీవ్కు సరైన అవకాశాలు లేకపోవడంతో సినిమాలు చేసుకుంటున్నాడు. సుమ మాత్రం స్టార్ డమ్ తో దూసుకుపోయింది. ఈ క్రమంలో సుమ రాజీవ్ కనకాల మధ్య మనస్పర్ధలు వచ్చాయని, ఇద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలు చాలా కాలంగా సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ విషయంలో సుమా చాలా సార్లు క్లారిటీ ఇచ్చినా వచ్చే వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి(Rajeev Kanakala).

Suma Rajeev

ఈ క్రమంలో రాజీవ్ కనకాల ఈ పుకార్లపై స్పందించారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజీవ్ కనకాలకు ఈ విషయాన్ని గురించిన ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే సుమా. నేను విడాకులు తీసుకున్నామని వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. అలాంటిది ఏమీ లేదని చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ఇదే టాక్ మా అమ్మానాన్నలు ఉన్నప్పుడు వోచి ఉంటే ఇంకా ఎక్కువ బాధ ఉండేది ఏమో అన్నారు. అయితే సుమ ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోదు.(Rajeev Kanakala)

Suma Rajeev Kanakala

అయితే తనంత తేలిగ్గా నెను తీసుకోలేను అన్నారు. ఎందుకంటే ఈ విషయంలో తన పిల్లలు బాగా సఫర్ అయ్యారు. ఈ విషయంపై స్కూల్ లో పిల్లలు కాస్త ఇబ్బంది పడ్డారు అని అన్నాడు. వాళ్ళకి ఎదురైన ప్రశ్నల వాళ్ళ ఎంత ఇబ్బంది పడి ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి వార్తలు వస్తుండటం బాధేస్తుంది అన్నారు. అంతేకాదు నేను సుమ విడిపోలేదు కలిసే ఉన్నామని చెప్పడం కోసం తన షోస్ కి నేను వెళ్ళాను తన ఈవెంట్ కి వెళ్ళాను.

ఇటీవల యూస్ లో ఉన్నపుడు రీల్స్ కూడా చేశాం. ఆ రీల్ బాగా వైరల్ అయింది కూడా. ఇలా మేము కలిసే ఉన్నాం బాబోయ్ అని చెప్పుకోవడం నాకు కష్టమైపోతుందని అన్నాడు. ప్రస్తుతం రాజకీయ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University