Cinema

Mega Hero: చదువుకునే రోజుల్లోనే సూసైడ్ చేసుకోవాలనుకున్న మెగా హీరో..? కారణం ఇదే..

Mega Hero Sucide: మెగా హీరోలు అనగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్, నాగబాబు, మెగారామ్ చరణ్, ఇలాగే మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వీళ్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా వాళ్ళ కెరీర్లో సినిమా రంగంలో నిలబెట్టుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లో అచ్చం చిరంజీవి లాగానే ఉంటాడని చాలా క్రేజ్ వచ్చింది.

mega-hero-sai-dharam-tej-wanted-to-commit-suicide-during-his-studying-days-this-is-the-reason

సాయి ధరమ్ తేజ్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో’బ్రో’ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై సాయిధరమ్ తేజ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాని మొదట చేసేందుకు నిర్ణయించుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కి ఫోన్ చేసి మనిద్దరం కలిసి ఒక సినిమా చేద్దాం. నువ్వు హీరోగా చెయ్యి అని చెప్పగానే. పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ పంచుకొంటాను అనగానే ఎగిరి గంతేస్తాడట. ఈ సినిమా ఇప్పుడు 28తేదీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందంతో ఎగిరిగంతేస్తున్నారు(Mega Hero Sucide).

Sai Dharam Tej

అయితే ‘బ్రో’ సినిమా ప్రమోషన్స్ కోసం సాయిధరమ్ తేజ్ విపరీతంగా కష్టపడుతున్నాడు. అనేక చోట్ల తిరుగుతూ అనేక ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అయితే రాజకీయంగా బిజీగా ఉండటం వల్ల ఈ ప్రమోషన్స్ పై అతను టైమ్ పెట్టడానికి ఇక్కడలేదు కాబట్టి వాళ్ళ మావయ్య పనిని కూడా నిర్వహిస్తూ ప్రమోషన్స్‌లో ఉషారుగా తిరుగుతున్నాడు. ఈ ప్రమోషన్స్ చేసే క్రమంలో ఇంటర్వ్యూలో కూడా ఈ సినిమా తర్వాత ఆరు నెలల పాటు బ్రేక్ తీసుకుంటాను అన్న విషయం సాయిధరమ్ తేజ్ చెప్పడం జరిగింది.(Mega Hero Sucide)

Sai dharam Tej Pawan Kalyan

అలాగే ఈ సినిమా కచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుందని మంచి హిట్ కొడుతోందని కూడా కాన్ఫిడెంట్ గా సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు. ఇదిలా ఉంటే సాయిధరమ్ తేజ్ ఇంటర్వ్యూలో ఇటీవల ఒక విషయాన్ని బయటపెట్టాడు. చిన్న వయసులోనే తనువు మిస్టిక్ చేశాడని ఆ మిస్టేక్ వల్ల సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నానని చెప్పాడు. ఆ వయసులో అందరూ చేసేదే సాయిధరమ్ తేజ్ కూడా చేశాడు. చదువుకునే రోజుల్లోనే ఒక అమ్మాయిని ప్రేమించాడు. అయితే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి.

ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోవాలంటే ముందు ముందు ఏదైనా సంపాదించు. ఆ తర్వాత పెళ్లి అని ఆపేశారట.ఆ అమ్మాయికి పెళ్లైపోయింది. ఆ విషయం తెలియగానే సాయి ధరమ్ తేజ్ సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ తనకు ధైర్యం చెప్పి అలాంటి పనులు చేయకూడదని గట్టిగా చెప్పి తన కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేపట్టమని చెప్పడం వల్ల తాను ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డాడా.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University