Cinema

Rakul: బాలీవుడ్ ఆశలతో సౌత్ ఇండస్ట్రీ కి దూరం అయిన ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్..

Rakul: చాలా షార్ట్ టైమ్ లోని స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చేసారు రకుల్ ప్రీత్ సింగ్. సడన్ గా సౌత్ సినిమాకి దూరమైపోయారు. బాలీవుడ్ ఆశలతో నార్త్ బాట పట్టిన ఈ బ్యూటీకి అక్కడ కూడా అనుకున్న స్థాయిలో హైప్ రాలేదు. దీంతో అమ్మడి కెరీర్ స్లో అయింది. అయినా సరే సౌత్ సినిమాలు మాత్రం ఓకే చేయట్లేదు. సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఈ బ్యూటీ జోరు పెద్దగా కనిపించట్లేదు. సౌత్ లో స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో మాత్రం ఆ రేంజ్ సత్తా చూపించలేకపోతున్నారు.

rakul-preet-singh-is-a-popular-actress-who-has-moved-away-from-the-south-industry-to-bollywood-hopes

అజయ్ దేవగన్ అండ తో అవకాశాలు వస్తున్నా స్టార్ హీరోయిన్‌ అన్న టాక్ మాత్రం అందడం లేదు. బాలీవూడ్ ఆశలతో సౌత్ సినిమాలు దూరం అవ్వడం తో ఇక్కడ కూడా ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. నార్త్ మీద ఆశలు సౌత్ సినిమాలకు దూరమైన రకుల్ సౌత్ లో అవకాశాలు తగ్గిపోయిన విషయాన్ని మాత్రం అంగీకరించటంలేదు. రీసెంట్ టైమ్స్ లో ఈబ్యూటీ నటించిన బాలీవుడ్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ బాట పట్టాయి. దీంతో రఖుల్ కెరీర్ క్లైమాక్స్ కి వచ్చినట్లేనా అనే డిస్కషన్ మొదలైంది. ఈ టైమ్ లో అయినా సౌత్ఎంట్రీ గురించి ఆలోచిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది(Rakul).

rakul

ఆమధ్య సౌత్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటి అని మీడియాకు దిమ్మతిరిగిపోయే ఆన్సర్ ఇచ్చింది రఖుల్. సౌత్ మేకర్స్ నుంచి ఇంట్రెస్టింగ్ సినిమాలు రావడం లేదని, అందుకే ఇక్కడ సినిమాలు చేయడం లేదు అన్నారు రఖుల్. నిజంగానే రఖుల్ ఆఫర్స్ రావడం లేదా లేక ఎవరు ఆఫర్స్ ఇవ్వడం లేదు కాబట్టి అలా కవర్ చేస్తున్నార సిల్వర్ స్క్రీన్ మీద బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఈ బ్యూటీ వరుసగా ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు.(Rakul)

rakul preet

సోషల్ మీడియా ద్వారా గ్లామర్ ఇమేజ్ ని సిల్వర్ స్క్రీన్ మీద క్యాష్ చేసుకునే ప్లాన్ లో ఉన్నారు రఖుల్. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ తన అందంతో దేశాన్ని శాసించింది. సినిమాలలో అయినా లేదా నిజ జీవితంలో అయినా, దాదాపు ప్రతి భాషా పరిశ్రమలో పనిచేసిన పాన్-ఇండియా స్టార్, ఎల్లప్పుడూ తన లీగ్‌ని అందరిలో ప్రత్యేకంగా ఉంచుతుంది. ఆమె ఆడుకునే ఏవేషధారణలోనైనా, నటి ఒక ట్రెండ్‌ను సృష్టించడానికి దారితీస్తుంది.

ఫ్యాషన్ విమర్శకులు, పరిశ్రమ మరియు ప్రేక్షకుల నుండి బ్రౌనీ పాయింట్లను గెలుచుకోవడమే కాకుండా, అందమైన మరియు బహుముఖ నటి తన సోషల్ మీడియా టైమ్‌లైన్‌లో తన రూపాన్ని బాగా పూర్తి చేసే ఆసక్తికరమైన శీర్షికలను పోస్ట్ చేయడానికి కూడా ప్రసిద్ది చెందింది. ఈ ప్రత్యేక ఫీచర్‌లో, మనల్ని విస్మయానికి గురిచేసిన రకుల్ కూల్ మెరిసే దుస్తులను మేము పరిశీలిస్తాము…

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University