Cinema

Chiranjeevi: అభిమానులతో కలిసి నటిస్తున్న మెగా స్టార్ చిరంజీవి.. ఫాన్స్ ఇక పండగే..

Chiranjeevi Working With Fans: ఒకప్పుడు అందరూ ఆయన అభిమానులే. ఆయన సినిమాలు చూస్తూ పెరిగినవాలి ఒక్కసారైనా ఆయన్ని చూస్తే చాలు అనుకునే వాళ్ళు ఓచిన్న పాత్ర చేస్తే చాలు అని అనుకునేవాళ్ళు. కానీ వాళ్లే ఇప్పుడు అన్నయ్యకు అండగా నిలబడుతున్న తమ్ముళ్ళు అవుతున్నారు. ఒక్క చిరంజీవి మాత్రమే సాధ్యమవుతున్న అరుదైన చిత్రమిది. ఒకప్పుడు సపోర్టింగ్ రోల్ చేసినట్లే ఇప్పుడు చిరుతో మరో హీరోగా నటిస్తున్నారు. చిరంజీవి అనేది పేరు కాదు. తెలుగు సినిమా రూపురేఖలు మార్చేసిన టార్చ్ బెర్రర్. ఇంకా చెప్పాలంటే ఇండియన్ సినిమా కూడా కొత్త మార్కెట్ సెట్ చేసారు మెగాస్టార్ చిరంజీవి.

megastar-chiranjeevi-working-with-fans-after-re-entry-with-khaidhi-number-150-movie

అలాంటి హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎంతోమంది నటులు కలలు కంటూ ఉంటారు. అందులో చిరు ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం అలాంటి తన హార్డ్ కోర్ ఫాన్స్ తోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తన అభిమానులతోనే పని చేస్తున్నారు చిరు. ఖైదీ నెంబర్ 150 దర్శకుడు వినాయక్ మెగా అభిమాని ఇక ఆచార్యలో రామ్ చరణ్ తో స్క్రీన్ పంచుకున్నారు. చిరంజీవి తండ్రి పైగా చిన్నప్పటి నుంచి చూస్తున్న హీరో కావడంతో చరణ్‌కు చిరు కంటే అభిమాన హీరో ఎవరు ఉండరు. వాల్తేరు వీరయ్య లో తమ్ముడు లాంటి రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు మెగాస్టార(Chiranjeevi Working With Fans).

chiranjeevi sathyadev

వాల్తేరు వీరయ్య విజయంలో రవితేజ పాత్ర కీలకమే. సెకండాఫ్‌లోతను తగ్గి మాస్ మహారాజ రవితేజ కారెక్టర్ పెంచారు మెగాస్టార్. ఇంకా గాడ్ ఫాదర్ లోను, తన అభిమాని సత్యదేవ్‌తో కలిసి నటించారు చిరంజీవి. ఇప్పుడు సెట్స్‌పై ఉన్న భోళా శంకర్ కు మెహర్ రమేష్ దర్శకుడు. ఈ నరనరాల్లో చిరంజీవి ఉన్నారు. అందుకే అభిమాన హీరోను ఎలా చూపించాలి అనుకున్నారు. అలాగే ప్రెసెంట్ చేసారు మెహర్ రమేష్, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో త్వరలోనే సినిమా చేయబోతున్నారు చిరంజీవి అందులో ముందు సిద్దు, జొన్నలగడ్డ నటిస్తారనే ప్రచారం జరిగినా ఇప్పుడు ఆ స్థానంలోకి శర్వానంద్ వచ్చినట్లు తెలుస్తోంది.(Chiranjeevi Working With Fans)

chiranjeevi sharva ram charan

20 ఏళ్ల కింద ఓ ఆడ్ చిరుతో పాటు ఫస్ట్ టైమ్ నటించారు శర్వానంద్. ఆ తర్వాత శంకర్‌దాదా ఎంబీబీఎస్ లో చిన్న పాత్ర చేశారు. ఇప్పుడు అదే చిరు సినిమాలో మరో హీరోగా నటించబోతున్నారు శర్వానంద్. మొత్తానికి వరుసగా ఫ్యాన్స్‌తో కలిసి నటిస్తున్నారు చిరు. మెగాస్టార్ చిరంజీవి నటించిన “భోలా శంకర్” ఆగస్ట్ 11న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్ బోర్డ్ నుండి ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ వచ్చిందని రెండు రోజుల క్రితం చిత్రబృందం తెలియజేసింది.

ఇప్పుడు, తాజా అప్‌డేట్ ఏమిటంటే, సినిమా 160 నిమిషాల నిడివిని కలిగి ఉంటుంది. ఈ చిత్రం అజిత్ నటించిన “వేదాళం”కి రీమేక్ అయినప్పటికీ, దర్శకుడు మెహర్ రమేష్ తెలుగు వెర్షన్‌లో చాలా మార్పులు చేసినట్లు కథానాయిక తమనా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ఆదివారం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University