Cinema

RGV : తండ్రి మరణించిన చూడడానికి వెళ్ళలేదు.. అందుకేనా..?

Ram Gopal Varma : వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ.. అడల్ట్ చిత్రాలన్నీ చేసి ప్రేక్షకుల్లో తన ఇమేజ్ ను కోల్పోయిన ఆయన ఒకప్పుడు శివ, క్షణ క్షణం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి భారీ విజయాన్ని అందుకున్నారు. అదే సమయంలో స్టార్ డైరెక్టర్లు కూడా ఆయన డైరెక్షన్ పట్ల ధీమాగా ఉన్నారు అంటే ఆయన సినిమాలను ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడో అర్థం చేసుకోవచ్చు. సమాజంలోని సహజత్వాన్ని ఆకట్టుకునేలా సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి.

that-is-why-ram-gopal-varma-did-not-go-to-see-his-fathers-death

ఏం చేసినా కొత్తగా ఆలోచించే వర్మ ఈ లోకంలో తనకే అసలైన స్వాతంత్య్రం ఉందంటూ ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక ఈయన మాత్రమే కాదు తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసే వారు కూడా అలాంటి ధోరణిలోనే ప్రవర్తిస్తూ ఉండడం గమనార్హం .ఎవరికి భయపడకుండా.. నచ్చింది చేసుకుంటూ వెళ్లిపోవడమే నినాదంగా సాగిపోతూ ఉండే వర్మకి అసలు ఎమోషన్స్ అనేవి ఉండవని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన తీసే ప్రతి సినిమాలో కూడా అదే విషయం స్పష్టంగా తెలిసేలా చేస్తూ ఉంటాడు(Ram Gopal Varma).

Ram Gopal Varma Apsara rani

ముఖ్యంగా చావు పుట్టుక వంటి విషయాలపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనకసలు చావు అంటేనే ఇష్టం ఉండదని ఎవరైనా చనిపోతే కూడా చూడడానికి వెళ్ళను అని ఆయన కామెంట్ చేశారు.. వర్మ మాట్లాడుతూ నా కాలేజ్ ఫ్రెండ్ లో ఒకతను తన తల్లి ఈమధ్య మరణించింది అని నాకు ఒక మెసేజ్ పెట్టాడు కానీ నేను రిప్లై ఇవ్వలేదు.. ఓ పది రోజుల తర్వాత మళ్లీ మెసేజ్ చేశాడు తన తల్లి చనిపోయిందని చెప్పినా కూడా ఆ సమయంలో రిప్లై ఇవ్వలేదని ఫీలయ్యాడు.(Ram Gopal Varma)

Ram Gopal Varma

అప్పుడు నేనేం చెప్పానంటే నాకసలు చావు అంటేనే ఇష్టం ఉండదు అని ఈ ఇష్యూ కి ఎప్పుడు రియాక్ట్ కాను అని చెప్పాను. మరియు ఒకసారి మా నాన్న చనిపోయినప్పుడు కూడా, నేను ఏడుస్తూ చూడకూడదనుకుంటే మా నాన్న ఫోటోను తీసివేయమని అడిగాను. ఇక పెట్టడం కుదరదు అని అన్నాను.. ఎందుకంటే ఆ ఫోటో చూసినప్పుడల్లా మా నాన్న లేడని, నాకు నచ్చదని గుర్తుకొస్తుంది. అదే నా నిర్ణయం అని వర్మ అన్నారు.

ఇటీవల, ఏస్ డైరెక్టర్ హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించి, దానికి RGV డెన్ అని పేరు పెట్టారు. రాంగోపాల్ వర్మ కలిసేందుకు నటి అప్సర రాణి అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఆమె తన పర్యటన నుండి వరుస చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆమె కొన్ని బికినీలతో సహా వివిధ రకాల బట్టలు ధరించి ఆఫీసు చుట్టూ పోజులిచ్చింది. ఒక చిత్రంలో, అప్సర తెల్లటి చొక్కా ధరించి దర్శకుడి పక్కన నిలబడి కనిపిస్తుంది. ఆమె ఫోటోలు పోస్ట్ చేసిన వెంటనే అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన పర్యటన నుండి.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University