Cinema

Business Man : ‘బిజినెస్ మాన్’ వంటి సూప‌ర్ హిట్ మూవీని చీప్ రీజ‌న్ తో రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..?

Mahesh Babu Business Man : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ లో నిలిచిన సినిమాల్లో “బిజినెస్ మేన్` ఒకటి. డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇండస్ట్రీ హిట్ అయిన పోకిరి తర్వాత మహేష్, పూరి కాంబోలో వ‌చ్చిన రెండో సినిమా ఇది. అందాల చందమ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇందులో సాయాజీ షిండే, ప్రకాష్ రాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్. ఆర్. మూవీ మేకర్స్ ఆర్.ఆర్.వెంకట్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ స్వ‌రాలు అందించాడు.

the-star-actor-rejected-a-mahesh-babu-super-hit-movie-business-man-with-cheap-reason

త‌మిళ‌నాడుకు చెందిన ఒరిజినెల్ గ్యాంగ్ స్ట‌ర్ క‌థ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. 2012 సంక్రాంతి పండుగ కానుక‌గా జనవరి 12న విడుద‌లైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో మహేష్ బాబు వ‌న్ మ్యాన్ షో చేశాడు. అలాగే పూరీ జ‌గ‌న్నాథ్ మార్క్ డైలాగ్స్ ఈ సినిమాలో బాగా పేలాయి. థమన్ సంగీతం, మహేష్-కాజల్ ల కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. అలాగే ఈ సినిమాలో మహేష్, కాజల్ మధ్య ఓ లిప్ లాక్ సీన్ ఉందట. నమ్రత అనుమతితో ఈ సీన్‌ను మహేష్‌ చేయించారు(Mahesh Babu Business Man).

Surya Puri Jagannadh

ఎట్టకేలకు ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. బిజినెస్ మ్యాన్ సినిమాకు మహేష్ బాబు ఫస్ట్ ఛాయిస్ కాదు. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమా కథను మొదట కోలీవుడ్ స్టార్ సూర్య వద్దకు తీసుకెళ్లాడు. అయితే కథ నచ్చినప్పటికీ డేట్స్ లేవని సున్నితంగా తిరస్కరించాడు. ఆ తర్వాత మహేష్ తో బిజినెస్ మేన్ సినిమా చేసి.. ఆ సినిమా మంచి విజయం సాధించింది. దాంతో వరస్ట్ సీజన్ లో అనవసరంగా బిజినెస్ మ్యాన్ సినిమా నుంచి తప్పుకున్నందుకు సూర్య కాస్త బాధపడ్డాడు.(Mahesh Babu Business Man)

Mahesh Babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అటడు, ఖలేజా వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలు కమర్షియల్ హిట్ కాలేదు. కానీ అభిమానులను మాత్రం ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతోంది. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో `గుంటూరు కారం` అనే సినిమా చేస్తున్నాడు. అటడు, ఖలేజా వంటి సినిమాలతో.

ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా ఎంపికయ్యారు. అయితే రీసెంట్ గా పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అలాగే పూజా హెగ్డే త‌ప్పుకోవ‌డంతో మ‌రొక హీరోయిన్ ను తీసుకున్నార‌ట‌. ఇదంతా ప్ర‌చారం మాత్ర‌మే. దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ల‌న రాలేదు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University