Cinema

Nara Rohith: ప్రతినిధి సీక్వెల్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రముఖ నటుడు నారా రోహిత్..

Nara Rohith: డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకునే హీరో నారా రోహిత్ గత కొంత కాలంగా ఈ హీరో అసలు సినిమాలు అటెంప్ట్ చేయడం లేదు. అలాంటిది ఉన్నట్టుండి కొత్త సినిమాతో మన ముందుకు వచ్చిపడ్డాడు. ఇంతకీ ఏంటా సినిమా? నారారోహిత్ కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. తన 19 చిత్రం ఫస్ట్ ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చాడు. బాణం సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నారా రోహిత్ తొలి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు(Nara Rohith).

nara-rohith-is-going-to-make-a-re-entry-with-the-prathinidhi-sequel

ఆ తర్వాత సోలో సినిమాతో కమర్షియల్ హిట్ అందుకుని తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో భిన్నంగా ముందుకెళ్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఒకప్పుడు విభిన్న కథతో టాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న నారా రోహిత్ ‘రౌడీ ఫెలో’, ‘అసుర’, ‘జ్యో అచ్యుతానంద’ తదితర చిత్రాల్లో నటించాడు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. కానీ నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆడియోన్స్ బాగా దగ్గరయ్యేలా చేసాయి. అలా ఇప్పటి వరకు దాదాపు 18.చిత్రాల్లో నటించాడు.

prathinidhi 2

2018 లో వీర భోగ వసంతరాయుడు చిత్రంలో నటించాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాలు సాయం చేసినా అవి పట్టాలెక్కలేదు. అలా దాదాపు ఐదేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు మళ్ళి సిల్వర్ స్క్రీన్ పై కనిపించేందుకు రెడీ అయ్యాడు. మరోసారి పొలిటికల్ నేపథ్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వానర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తన 19 సినిమాను అనౌన్స్ చేసాడు. పోస్టర్‌లో చేయి పైకెత్తి రెండు వేళ్ళు ముడిచి మూడు వేళ్ళు పైకి చూపిస్తూ డిజైన్ చేశారు. ఈ చేతికి కరెన్సీ నోట్లలా కనిపిస్తారు. పేపర్ లో చుట్టి ఉంచారు.(Nara Rohith)

Nara rohith

ఇంకా ఇందులో ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడతాడు అని రాసి ఉండటం ఆసక్తికరంగా ఉంది. అంటే ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో రానున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్రియేట్ అయింది. అలాగే మరికొందరు ఈ చిత్రం గతంలో వచ్చిన ప్రతినిధి కి సీక్వెల్ అని కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో వచ్చిన ఆశ్చర్యకరమైన ప్రకటనలలో ఒకటి నారా రోహిత్ సినిమాల్లోకి తిరిగి రావడం, మరియు మరొక విషయం ఏమిటంటే, పాపులర్ జర్నలిస్ట్ మూర్తి, టీవీ ఛానెల్ మూర్తి ఈ ప్రాజెక్ట్‌తో ఫిల్మ్‌మేకర్‌గా మారుతున్నారు. ‘ప్రతినిధి 2’ అనే టైటిల్‌తో ఈ చిత్రానికి మరో రోజు ప్రకటించారు. మరియు ఇక్కడ ఉంది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University