Cinema

Ram Gopal Varma : ప్రేమ వివాహం చేసుకున్న వర్మ.. విడాకులు తీసుకువొడానికి కారణం అదేనా..?

Ram Gopal Varma Divorce: ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి, గతంలో పాన్-ఇండియా స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమధ్య వివాదాస్పద సినిమాలు చేసినా ఆయన అభిమానులు మాత్రం ఇప్పటికీ పాత రామ్ గోపాల్ వర్మగానే చూస్తున్నారు. ఇండస్ట్రీకి కొత్త అయిన రాంగోపాల్ వర్మ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి ఆ తర్వాత మెల్లగా గ్రాఫ్ పడిపోవడంతో ఈ మధ్య కాలంలో రాజకీయ నేతలు, సమాజంలో జరిగే సంఘటనలకు సంబంధించిన సినిమాలు చేస్తూ వివాదాస్పద దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు.

ram-gopal-varma-who-had-a-love-marriage-and-got-a-divorce-is-that-the-reason

ఈయన సినిమా తీయడమే కాదు మాట్లాడినా కూడా వివాదమే. అలాంటి రాంగోపాల్ వర్మ తన భార్యను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. మరి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకి ఎందుకు విడాకులు ఇచ్చారు అనేది చాలామందికి తెలియదు. ఇక రామ్ గోపాల్ వర్మ తన భార్యకి ఎందుకు విడాకులు ఇచ్చారంటే.. రాంగోపాల్ వర్మ చదువుకునే రోజుల్లోనే స్టోరీలు తన ఫ్రెండ్స్ కి చెబుతూ ఉండేవారట. ఇక కథలు విన్న ఆయన స్నేహితులైతే నా దగ్గర డబ్బులు ఉంటే కచ్చితంగా నిన్ను డైరెక్టర్గా పెట్టి సినిమా తీస్తాను అనేవారట(Ram Gopal Varma Divorce).

ram Gopal Varma Pic

చదువు పూర్తయ్యాక తాజ్ హోటల్ లో 800 రూపాయల జీతం తీసుకుంటూ ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రత్న. ఒకరినొకరు ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిద్దరికీ ఓ పాప కూడా పుట్టింది. సినిమాల పిచ్చి ఉన్న రాంగోపాల్ వర్మ సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి కొందరు నిర్మాతలకు కథలు చెప్పారు. అలా ఒక్కసారిగా నాగార్జున హీరోగా నటించిన శివ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడంతో ఆ సినిమాకు దర్శకత్వం వహించి సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.(Ram Gopal Varma Divorce)

Ram Gopal Varma

ఈ సినిమా తర్వాత రాంగోపాల్ వర్మకు సినిమాలపై ఆసక్తి ఎక్కువై, ఎప్పుడూ సినిమాల మూడ్ లోనే ఉండి ఇంటికి కూడా రాకుండా సినిమాల గురించే ఆలోచించేవాడు. ఇక రాంగోపాల్ వర్మతో విసిగి వేసారిన భార్య ఇంటికి వచ్చిన ప్రతిసారీ రాంగోపాల్ వర్మను ఎక్కడికి వెళ్తున్నావు..ఏం చేస్తున్నావు..ఎందుకు తాగుతున్నావు అని అడుగుతూనే ఉంది.. కానీ అతను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు.

అతని భార్య. దాంతో ఆమెకు కోపం మరింత ఎక్కువైంది. భార్య నుంచి తప్పించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించేవాడు. రాంగోపాల్ వర్మ చేష్టలకు విసిగి వేసారిన భార్య కూతురిని తీసుకుని భర్తకు విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University