Cinema

Spy : హీరో నిఖిల్ ప్రొడ్యూసర్ ని కొట్టింది ఇందుకేనా..? స్పై షూట్ లో పెద్ద గొడవ..

Spy : హీరో నిఖిల్ గురించి మనకి ప్రేత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఫస్ట్ సినిమా హ్యాపీ డేస్ తో ఎంట్రీ ఇచ్చి అందులో రాజేష్ క్యారెక్టర్ గా చేసి వరుణ్ సందేశ్ హీరోగా చాలా పాపులర్ అయ్యారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం తో హీరో నిఖిల్ వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే హీరో నిఖిల్ అనుకునేంత హిట్లు మాత్రం లభించలేదు. ఆ తర్వాత స్వామి రారా అనే సినిమా చేసి మళ్లీ పెద్ద సక్సెస్ అందుకుని తన కెరీర్ ని ఒక మలుపు తిప్పుకున్నారు. స్వామి రారా తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ లో ఆచి తూచి అడుగులు వేస్తూ చాలా స్టార్ పాపులర్ హీరోగా సినీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు (Nikhil Fight With Producer).

Nikhil-Fight-With-Producer

ఇక పోయిన సంవత్సరం కార్తికేయ 2 చిత్రంతో టాలీవుడ్ ఏ కాకుండా బాలీవుడ్ ఆడియన్సు ని కూడా మెప్పించి. పాన్ ఇండియా స్టార్ అయ్యి. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సూపర్ హిట్ అందుకున్నారు. ఇక తాజా గా Garry BH దర్శకత్వంతో నిఖిల్ హీరోగా నటిస్తున్న స్పై అనే సినిమా టైటిల్ తో మన ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ చిత్ర బృందం సినిమా ట్రైలర్ ని మరియు టీజర్ ని రిలీజ్ చేయగా రెండిటికి కూడా ప్రేక్షకుల ధ్వారా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక టీజర్ ని మరియు ట్రైలర్ ని చూస్తుంటే నిఖిల్ అద్భుతమైన కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అని అర్ధం అవుతుంది.

nikhil-spy-movie

ఈ విషయం ఇలా ఉండగా రీసెంట్ గా ఈ సినిమా ప్రొడ్యూసర్ తో నిఖిల్ వివాదం అయినట్లు ఈ మధ్య కాలంలో చాలా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సినిమా నిర్మాత మా ఇద్దరి మధ్య వివాదం నిజంగానే జరిగింది అని ఒప్పుకున్నారు. అసలు విషయానికి వస్తే స్పై సినిమా రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ప్రొడ్యూస్ చేస్తుండగా ఈ నెల లాస్ట్ కి 29 తారీఖున రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అందుకు నిఖిల్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ చిత్రం దేశం మొత్తం చూడాలని అతని ఆలోచన.. కానీ నిర్మాత అందుకు సిద్ధంగా లేకపోవడంతో నిఖిల్ నిర్మాత పై కోప్పడి షూటింగ్ లో నేను డబ్బింగ్ చెప్పను అని చెప్పేసాడు అంట (Nikhil Fight With Producer).

spy-movie-producer-k-rajashekar-reddy

ఇక సినిమా ప్రొమోషన్స్ కి కూడా రాను అని చెప్పేశాడట. దాంతో నిర్మాత హిందీలో కూడా డబ్ చేయక తప్పలేదు. ఈ వివాదం పై నిఖిల్ స్పందిస్తూ అవును నేను నిర్మాత షూటింగ్ లో తిట్టుకున్నామ్ కొట్టుకునామ్ కూడా అని చెప్పారు.

క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తగ్గ కూడా దనేది నా తాపత్రయం. అందుకే గొడవ పడ్డాము. గొడవ తరవాత మళ్లీ కూర్చొని కూల్ గా సమస్యను సాల్వ్ చేసుకున్నాము అని క్లారిటీ ఇచ్చారు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University