Cinema

Project K : ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ప్రాజెక్ట్ కే నుండి అదిరిపోయే అప్డేట్..

Project K New Update : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కె.వైజయంతీ మూవీస్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ మూవీగా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా కమల్ హాసన్ ఈ సినిమాలో నటించబోతున్నారని తెలియడంతో ఈయన ఎలాంటి పాత్రలో నటించబోతున్నారన్న ఆసక్తి అభిమానులలో నెలకొంది.

good-news-for-prabhas-fans-amazing-update-from-prabhas-project-k

పాన్ ఇండియా హీరో ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ -K. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. కీలకమైన పాత్రలలో అమితాబచ్చన్ ,దిశా పటాన్ని నటిస్తూ ఉన్నారు. అలాగే కమలహాసన్ కూడా ఇందులో విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికి ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కావడంతో అరుదైన గౌరవాన్ని అందుకుంటోంది. గత కొద్ది రోజులుగా, మొదటి టైటిల్ గ్లింప్సెస్ జూలై 20 న రివీల్ కానున్నాయి(Project K New Update).

Prabhas Project K

ఈ వార్తలను నిజం చేస్తూ, మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. శాన్ డియాగో కామిక్-ఖాన్ వేడుకల్లో టైటిల్ మరియు విడుదల తేదీతో పాటు మొదటి సంగ్రహావలోకనం వెల్లడించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇంత అరుదైన గౌరవం ఇప్పటి వరకు ఏ తెలుగు సినీ పరిశ్రమకు దక్కలేదని తెలుస్తోంది. అమెరికాలో ఈ నెల 19న ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. జులై 20వ తేదీన ప్రాజెక్ట్-K సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ ని రివిల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు చిత్ర బృందంలో ప్రభాస్ ,దీపిక, అమితాబచ్చన్ డైరెక్టర్ తదితరులు సైతం పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.(Project K New Update)

Project K

ఇక ఈ విషయం తెలియడంతో అటు అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్ ఎదురవుతుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇటీవల రిలీజ్ అయిన సలార్ టీజర్ ప్రభావాన్ని వివరిస్తూ “గూస్‌బంప్స్” వస్తున్నాయని పేర్కొంటున్నారు. భారతదేశం, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో సహా వివిధ ప్రదేశాలలో చిత్రీకరించబడిన ఈ చిత్రం అద్భుతమైన మాస్ యాక్షన్, అడ్వెంచర్ చిత్రంగా రూపొందింది.

రూ.200 కోట్ల బడ్జెట్‌తో, నిర్మాణ బృందం విజువల్ ఎఫెక్ట్స్‌లో భారీగా పెట్టుబడి పెట్టింది. ఫారిన్ స్టూడియో సేవలను వినియోగించుకున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటించింది. జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా రూ.5 వేల కోట్లను సాధిస్తుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
నటించబోతున్నారన్న ఆసక్తి అభిమానులలో నెలకొంది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University