CinemaTrending

Balakrishna: వాళ్లందరికీ ఫ్రీగా సినిమా.. బాలకృష్ణ సంచలన నిర్ణయం..

Balakrishna Bagavanth Kesari: అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి. దసరా కానుకగా నిన్న గురువారం థియేటర్స్ లో రిలీజ్ అయి సందడి చేస్తోంది. బాలయ్య ఎప్పుడూ చూపించే మాస్ కాకుండా ఎమోషన్ మెసేజెస్ తో రావడంతో సినిమాకి మంచి మార్కులే పడ్డాయి. భగవంత్ కేసరీ మంచి విజయం అందుకొని మొదటి రోజు ఏకంగా రూ. 33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. భగవంత్ కేసరి సినిమా విజయం సాధించడంతో నేడు చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన ప్రశ్న, పలు ప్రశ్నలకి సమాధానాలు తెలిపారు.

nandamakuri-balakrishna-sensational-decision-about-bagavanth-kesari-movie

ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకి చెప్పాలని మహిళలు తప్పుగా చూడొద్దని, ఆడవాళ్లను ఇంకా బలంగా పెంచాలని చూపించారు. ఇంత మంచి మెసేజ్ ని బాలయ్యతో డైరెక్టర్ చెప్పించడంతో అంత.అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలోని మంచి మెసేజ్ పిల్లలు అందరికీ చేరాలని, ముఖ్యంగా స్కూల్ ఏజ్ ఆడ పిల్లలందరికీ మెసేజ్ వెళ్లాలని భగవంత్ కేసరి టీం ఈ నిర్ణయం తీసుకున్నట్లు త్వరలో స్కూల్ పిల్లలకి పలు ఫ్రీ షో లు వేయనున్నట్లు అందరికి మెసేజ్ చేరేలా చర్యలు తీసుకోబోతున్నట్లు చిత్ర యూనిట్ చెప్పారు(Balakrishna Bagavanth Kesari).

దీనిపై పలువురు అభినందిస్తున్నారు. త్వరలోనే స్కూల్ విద్యార్ధులకి భగవంత్ కేసరి సినిమా ఫ్రీ గా చూపించబోతున్నారు. భగవంత్ కేసరి బాక్సాఫీస్ కలెక్షన్ 3వ రోజు భగవంత్ కేసరి చిత్రానికి పెద్దగా ప్రతికూల సమీక్షలు రానప్పటికీ, బాక్సాఫీస్ కలెక్షన్లు నిరాశపరిచాయి. మూడో రోజు కలెక్షన్లు కుదేలయ్యాయి. మొత్తంగా, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో ₹45 కోట్లు వసూలు చేసింది. దేశీయ కలెక్షన్ ప్రస్తుతం ₹31 కోట్లుగా ఉంది. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ ₹26.6 కోట్లు. గురువారం నాడు ₹16 కోట్లతో ప్రారంభమైన భగవంత్ కేసరి మూడవ రోజు ₹7.75 కోట్లు వసూలు చేసింది.(Balakrishna Bagavanth Kesari)

అయితే ఆదివారం దసరా కావడంతో ఈ రెండు మూడు రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. బాలకృష్ణ, కాజల్, శ్రీలీల జంటగా నటించిన భగవంత్ కేసరి చిత్రం తొలి షో నుంచే మిశ్రమ స్పందనను అందుకుంది. కథలో కొత్తదనం లేకపోవడంతో పాటు కనిపించని యాక్షన్ కూడా లేకపోవడంతో బాలయ్య అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్‌లో చాలా వరకు ఆసక్తి నెలకొంది. శనివారం తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ 50.59% మాత్రమే.

భగవంత్ కేసరి నిర్మాణ వ్యయం ₹64.5 కోట్లు. పండగ రోజున విడుదల చేస్తే ఆ మొత్తాన్ని కవర్ చేయవచ్చని నిర్మాతలు నమ్మారు. ఇప్పటి వరకు రూ. మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 19.97 కోట్లు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ₹16.5 కోట్లు, ఓవర్సీస్‌లో ₹4.95 కోట్లు వసూలు చేసింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University